కరోనా నివారణకు అమెరికా ఫైజర్ అనే టీకాను అక్కడి ప్రజలకు అందిస్తుంది.ఫైజర్ టీకా మొదటి డోస్ తీసుకున్నఓ అమెరికా నర్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యినట్లుగా సమాచారం.
ఈ విషయంను ఆ నర్సు డిసెంబర్ 18 తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.మొదటి డోస్ తీసుకున్న ఆమెకు ఓ రోజు మొత్తం చెయ్యి నొప్పి పెట్టడం తప్ప పెద్దగా ఏమి ప్రమాదం లేదని చెప్పింది.
ఇక ఆ నర్స్ కోవిడ్ యూనిట్ లో పనిచేస్తుంది.ఆ సమయంలో ఆమె కండరాల వణుకు మెడ నొప్పి తల తిరగడం,నీరసం గా ఉండటం వంటి లక్షణాలు కనిపించడంతో ఆమె సమీపంలోని ఓ హాస్పిటల్ లో కరోనా టెస్ట్ లు చెయ్యగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
ఈ విషయంపై ప్రముఖ అంటూ వ్యాదుల నిపుణునుడు క్రిస్టియన్ రామర్స్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.మొదటి డోస్ పనిచేయడానికి 10 నుండి 14 రోజుల సమయం పడుతుంది.
మొదటి డోస్ టీకా 50 శాతం మాత్రమే పనిచేస్తుంది. రెండో డోస్ టీకా ని ఆమె తీసుకోవాలిసి ఉంటుంది అప్పుడు మాత్రమే 95 శాతం పనిచేస్తుంది అన్నాడు.
మొదటి దశ టీకా డోస్ గురుంచి బయపడాలిసిన అవసరం ఏమి లేదు అన్నారు.ఫైజర్ టీకా 100 శాతం సురక్షితం అన్నారు.