హిట్ కోసం కంఫర్ట్ జోన్ దాటి ప్రయోగాలు చేస్తున్న దర్శకులు !

ఏ దర్శకుడికైనా ఒక్కసారి విజయం దక్కిందా దానితో మరిన్ని విజయాలు అందుకోవాలని కుతూహలపడతారు.ఆ కంఫర్ట్ జోన్ మరియు జోనర్ దాటి బయటకు రావడానికి సాహసం చేయాల్సిందే.

 Tollywood Directors And Their Experiments ,sekhar Kammul, Tollywood Director,-TeluguStop.com

అలాంటి సాహసాలు ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ దర్శకులు బాగానే చేస్తున్నారు.వారికి అచ్ఛచ్చిన అలాగే ఎన్నో హిట్స్ ఇచ్చిన జోనర్ ని వదిలి బయటకు వచ్చి కొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు.

మరి ఇలాంటి ప్రయోగాలు విజయాలను అందిస్తాయా లేదా తెలియాలంటే మరి కొంతకాలం ఎదురు చూడాలి.ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ ప్రయోగాలు చేస్తున్న దర్శకులు ఎవరు ? వారు తీస్తున్న ఆ సినిమాలు ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శేఖర్ కమ్ముల

Telugu Chandoo Mondeti, Lucky Baskhar, Prabhas, Sekhar Kammul, Thandel, Tollywoo

శేఖర్ కమ్ముల( Sekhar Kammul ) పేరు చెబితే అందరికి ఫీల్ గుడ్ మూవీస్ మాత్రమే గుర్తొస్తాయి.గతంలో హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా అంటూ ఎంతో అద్భుతమైన క్లాసికల్ సినిమాలు తీసిన ఈ క్లాస్ దర్శకుడు శేఖర్ కమ్ముల మొట్ట మొదటిసారి కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమానీ తీస్తున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కుబేర అనే పేరుని కన్ఫమ్ చేశారు.

చందు మొండేటి

Telugu Chandoo Mondeti, Lucky Baskhar, Prabhas, Sekhar Kammul, Thandel, Tollywoo

చందు మొండేటి ఇప్పటి వరకు ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.నిఖిల్ కి కార్తికేయ సినిమాతో మొట్టమొదటిసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించి కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా విజయాన్ని కట్ట పెట్టారు.అయితే ఇప్పటి వరకు తీసిన సినిమా జోనర్ ని కాదని నాగచైతన్యతో ఒక శ్రీకాకుళం నేపథ్యంలో తండేల్ అనే సినిమాకి స్వీకారం చుట్టారు.

పూర్తిస్థాయి మాస్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.పైగా ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ఇప్పటికీ ఒక పెద్ద బడ్జెట్ సినిమా తీయలేదు చందు.దాంతో నాగచైతన్య సినిమాతో ఈ సాహసం కూడా చేస్తున్నారు.

వెంకీ అట్లూరి

Telugu Chandoo Mondeti, Lucky Baskhar, Prabhas, Sekhar Kammul, Thandel, Tollywoo

తొలిప్రేమ వంటి మంచి సినిమాకి దర్శకత్వం వహించిన వెంకి అట్లూరి( Venky Atluri ) సర్ సినిమాతో మరొక కొత్త జోనర్ లోకి అడుగుపెట్టి విజయాన్ని అందుకున్నారు.ఈ రెండు సినిమాలకు విభిన్నంగా ఇప్పుడు లక్కీ భాస్కర్ ( Lucky Baskhar )అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

హను రాఘవపూడి

సీతారామాం సినిమాతో దుల్కర్ సల్మాన్ వంటి నటుడుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాతుకు పోయేలా చేసాడు హను రాఘవపూడి.ఒక ఫీల్ గుడ్ సినిమా తీసిన ఇతడు ఇప్పుడు ప్రభాస్ యాక్షన్ సినిమా తీయబోతున్నాడు.

మరి చూడాలి ఏ మేరకు హను రాఘవపూడి( Hanu Raghavapudi ) ప్రయోగం వర్క్ అవుట్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube