ఇంటర్ ఫెయిలైన వినాయక్ స్టార్ డైరెక్టర్ గా ఎలా మారాడో తెలుసా.?

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ వివి వినాయక్.

ఇండస్ట్రీ హిట్స్ సాధించిన ఈ దిగ్గజ దర్శకుడు పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో ఆయన జన్మించాడు.

కృష్ణారావు, నాగరత్నం దంపతులకు 1974 అక్టోబర్ 9న ఆయన జన్మించాడు.ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు.

చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే వినాయక్ కు వీరాభిమానం.చదువు పెద్దగా వచ్చేది కాదు.

ఇంటర్ ఫెయిల్ కావడంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడు.అదే సమయంలో తన తండ్రి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు.

Advertisement

అప్పుడే తను అప్పుల పాలయ్యాడు.ఏదైనా పనిచేసి తండ్రి చేసిన అప్పులను తీర్చాలని వినాయక్ భావించాడు.

అదే ప్రాంతానికి చెందిన ఈవీవీ సత్యనారాయణ దర్శకుడిగా మంచి పేరు సంపాదిస్తున్నాడు.ఆయన గురించి జనాలు మాట్లాడుకునేవారు.

అప్పుడే తను కూడా దర్శకుడిగా మారాలి అనుకున్నాడు వినాయక్.సినిమాల్లోకి వెళ్లడానికి తన తండ్రి ఒప్పుకోలేదు.అప్పులు తీరాలంటే వెళ్లక తప్పదని చెప్పాడు.1994లో హైదరాబాద్ కు వచ్చాడు.డైరెక్టర్ సాగర్ దగ్గర అప్రెంటీస్ గా పని మొదలు పెట్టాడు.

అమ్మ దొంగా మూవీ సమయంలో వినాయక్ పని సాగర్ కు బాగా నచ్చింది.ఓవైపు సాగర్ దగ్గర పని చేస్తూనే.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

మరోవైపు ఈవీవీ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేశాడు.

Advertisement

అనంతరం ఓ టీవీ షో సమయంలో బెల్లకొండ సురేష్ కు పరిచయం అయ్యాడు.వినాయక్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా చేసేందుకు బెల్లకొండ ఓకే చెప్పాడు.బెల్లంకొండ సురేష్ నిర్మాత, బుజ్జి సహ నిర్మాతగా సినిమా మొదలయ్యింది.

ఆది అని పేరు పెట్టారు.ఈసినిమా విడుదలై సంచనల విజయం సాధించింది.

ఆ తర్వాత బాలయ్యతో చెన్నకేశవరెడ్డి తీసాడు.అనంతరం నితిన్ తో దిల్ సినిమా చేశవాడు.

ఆ తర్వాత చిరంజీవి పిలిచి అవకాశం ఇచ్చాడు.దీంతో ఠాగూర్ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు వినాయక్.వరుస సినిమాలో సినిమా పరిశ్రమలో దూసుకెళ్తున్నాడు.

తాజా వార్తలు