తెలుగు లో ఒకప్పుడు చాలా మంది కమెడియన్లు( Comedians ) ఉండేవారు.అందులో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అయితే వీళ్లలో ఏ టైప్ ఆఫ్ కామెడీ కావాలో అలాంటి నటులు ఇండస్ట్రీ లో సెపరేట్ గా ఉండేవాళ్ళు, అంటే కాలేజీ లో ప్రిన్సిపల్ అంటే ఎమ్మెస్ నారాయణ,( MS Narayana ) లెక్చరర్ అంటే ధర్మవరపు సుబ్రమణ్యం( Dharmavarapu Subramanyam ) లాంటి వారు గుర్తుకు వచ్చేలా ఆ పాత్రల్లో వాళ్ళు జీవించేవారు…ఇలా డిఫరెంట్ టైప్ లో ఆర్టిస్టులు ఉండేవారు కానీ ఇప్పుడు రోజులు మారాయి.

కమెడియన్లు చాలా వరకు కరువు అయ్యారనే చెప్పాలి ప్రస్తుతం సినిమాల్లో కామెడీ చేస్తున్న వాళ్లలో వెన్నెల కిషోర్, సత్య లాంటి కమెడియన్లు మాత్రమే చాలా బాగా చేస్తూ సినిమా సక్సెస్ లో భాగం అవుతున్నార.అయితే రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లాంటి వాళ్ళు కామెడీ చేసిన కూడా వాళ్ళు చేసే కామెడీ తెలంగాణ స్లాంగ్ లో అయితేనే బాగా వర్క్ ఔట్ అవుతుంది…ఇక వెన్నెల కిషోర్( Vennela Kishore ) అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న ఒక మంచి కమెడియన్ అనే చెప్పాలి ఆయన చేసిన విచిత్రమైన హావా భావాలు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేస్తుంటాయి.స్క్రీన్ మీద ఆయన కనిపడితే చాలు అందరూ ఫుల్ గా అరుస్తు అల్లరి చేస్తూ ఉంటారు…

అందుకే వెన్నెల కిషోర్ ని ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం వాడుతున్నారు సినిమాలో క్యారెక్టర్లు లేకపోయినా కూడా వెన్నెల కిషోర్ కోసం క్యారెక్టర్ రాసుకొని మరి ఆయన్ని బాగా వాడుతున్నారు…ఇక సత్య( Comedian Satya ) కూడా అంతే ముఖ్యంగా నాగ శౌర్య ,నిఖిల్, నితిన్ లాంటి హీరో లా సినిమాల్లో ఎక్కువ గా కనిపిస్తూ ప్రేక్షకులను తన నటన తో కితకితలు పెట్టిస్తాడు…అందుకే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెంట్ ఉండేలా చూసుకుంటూ సినిమా మొత్తం కనిపిస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తాడు…