అల్లు అర్జున్, సుకుమార్ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రంలో రష్మిక పాత్ర గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వార్తలు జోరుగా సోషల్ మీడియాలో వస్తున్నాయి.ఇటీవల ఈ చిత్రంలో రష్మిక మందన్న పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.
ఇన్వెస్టింగ్ ఆఫీసర్‌గా ఆమె అండర్ కవర్‌లో ఉంటుందని పుకార్లు వచ్చాయి.కాని ఆ వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయమై స్పందిస్తూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు.రష్మిక మందన్న పోలీసు ఆఫీసర్ కాదు. ఆమె ఒక సింపుల్ అమ్మాయి మాత్రమే.సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అన్నారు.
అలాగే అల్లు అర్జున్‌కు ఆమెకు రొమాంటిక్ సీన్స్ ఉండవని కూడా వార్తలు వచ్చాయి.అవి కూడా నిజం కాదని, బన్నీతో ఆమె రొమాంటిక్ సీన్స్ చాలానే ఉంటాయని ఈ సందర్బంగా వారు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే కేరళలో షూటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నలు చిత్తూరు రాయలసీమ యాసను నేర్చుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.వీరిద్దరు కలిసి రొమాంటిక్ సీన్స్‌లో అదరగొట్టడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.