కేంద్రంలో మరోసారి కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఎంపీ జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.దేశంలో బీజేపీ తప్ప మరో పార్టీ లేదని ఎవరిని అడిగినా చెబుతారన్నారు.
వచ్చే ఎన్నికల్లో 400 పార్లమెంట్ సీట్లు సాధించాలనే ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.అదేవిధంగా బీజేపీ కోల్పోయిన 174 సీట్లపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టిందన్నారు.
అటు ఏపీలో జనసేనతో కలిసి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు వెల్లడించారు.రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సదస్సుల నిర్వహణకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని జీవీఎల్ స్పష్టం చేశారు.