నేడు ఆఫ్ఘాన్ తో రెండో టీ20 మ్యాచ్.. సిరీస్ పై కన్నేసిన భారత్..!

భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్( Afghanistan ) మధ్య మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది.ఈ మ్యాచ్లో గెలిచి ఆడాల్సిన మరో మ్యాచ్ ఉండగనే సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్.

 Today Is The Second T20 Match With Afghanistan India Eyes On The Series-TeluguStop.com

ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ బరిలోకి దిగనున్నాయి.అయితే ఈ మ్యాచ్ భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఎంతో స్పెషల్.

ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ అత్యంత అరుదైన ఒక రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు.నేటి మ్యాచ్ తో 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన అంతర్జాతీయ మొదటి క్రికెటర్ గా రోహిత్ శర్మ( Rohit Sharma ) సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.

2022 లో జరిగిన టీ20 ప్రపంచ కప్ తరువాత దాదాపుగా 14 నెలల పాటు సుదీర్ఘ విరామం తీసుకున్న రోహిత్ శర్మ మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ తో అంతర్జాతీయ టీ20లలో పునారాగమనం చేశాడు.అయితే తొలి మ్యాచ్లో దురదృష్టవశాత్తు ఒక్క పరుగు కూడా చేయకుండానే రన్ అవుట్ గా రోహిత్ శర్మ వెనుతిరిగాడు.నేడు జరిగే రెండో టీ20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించి మ్యాచ్ ను గెలిపిస్తే.ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోనుంది.

భారత జట్టు 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ గా రోహిత్ శర్మ సరికొత్త చరిత్రనే సృష్టించాడు.ఇక టీ20 ఫార్మాట్ లో 100కి పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడిన రెండవ భారతీయుడుగా విరాట్ కోహ్లీ నిలిచాడు.విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 115 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు.ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) తో తొలి టీ20 మ్యాచ్ కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రెండో టీ20 మ్యాచ్ లో జట్టులో చేరనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube