ఓటుకు నోటు కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ జరగనుంది.ఈ మేరకు జస్టిస్ సుందరేశ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ( Justice Sundaresh, Justice SVN Bhatti )ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy ) దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ నిర్వహించనుంది.అయితే చార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు 22 సార్లు ఉన్నప్పటికీ ఆయన పేరును నిందితుడిగా చేర్చలేదని ఆర్కే పేర్కొన్నారు.2017 లో ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కాగా ప్రస్తుతం ఓటుకు నోటు కేసును తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తుంది.







