తగ్గిన బంగారం రేటు, ఎంత తగ్గిందో తెలుసా?

ఇతర దేశాల్లో ఏమో కాని మన దేశంలో మాత్రం బంగారం వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.

మన దేశంలో ఆడవారు బంగారం కోసం ఏం చేసేందుకు అయినా సిద్దం అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది.

బంగారం కోసం ఎన్నో రకాలుగా మోసాలు అన్యాయాలు కూడా జరుగుతుండటం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.బంగారం రేటు అంతకంతకు పెరిగి పోతుంది.

ప్రస్తుతం బంగారం రేటు 40 వేల రూపాయలకు చేరువలో ఉండటంతో అంతాకూడా 2020 వరకు 50 వేలకు బంగారం రేటు పెరుగుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.బంగారం రేటు భారీగా పెరిగి తక్కువగా తగ్గుతూ ఉంటుంది.

బంగారం రేటు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది.అయితే అప్పుడప్పుడు అరుదుగా వంద రెండు వందలు తగ్గుతుంది.

Advertisement

నిన్న బంగారం రేటు 149 రూపాయలు తగ్గడంతో మీడియాలో ఆహా ఓహో అంటూ బంగారం రేటు తగ్గిందంటూ కథనాలు వచ్చాయి.బంగారం రేటు అంత తక్కువ తగ్గినా కూడా అదొక గొప్ప విషయంగా చెబుతున్నారు.

ఇప్పటికే 40 వేలకు టచ్‌ అయిన బంగారం రేటు అంతా అనుకున్నట్లుగా 50 వేలకు వెళ్లే రోజు త్వరలోనే ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు