చాలా రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే.. పంచముఖి శివలింగ క్షేత్ర దర్శనం చేసుకోవాల్సిందే..?

మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి.కొండకోనలతో పాటు ఢిల్లీ( Delhi ) నుంచి గల్లి వరకు లయకారుడైన శివయ్య దేవాలయాలు చాలా ఉన్నాయి.

ఇందులో అనేక దేవాలయాలు మహిమలు కలవని చాలామంది భక్తులను నమ్ముతారు.ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కొలువైన దేవుళ్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తారు.

అటువంటి మతపరమైన ప్రాముఖ్యత గల నగరాలలో ఒకటి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని కూడా ఉంది.ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి.

వాటిలో ఒక శివాలయాన్ని సందర్శించడం ద్వారా కుటుంబ వృద్ధి, అశ్వమేధ యాగాన్ని నిర్వహించినప్పుడు వచ్చే శుభ ఫలితాలు కలుగుతాయని ప్రజలు నమ్ముతారు.

Advertisement

సంవత్సరం పొడుగునా భక్తులు ఈ దేవాలయానికి తరలి వస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే పండుగలు, పర్వదినాల సమయాలలో ఈ దేవాలయంలో భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది.ఉజ్జయినిలోని 84 ప్రముఖ శివ క్షేత్రాల్లో 14వ స్థానంలో ఉన్న శ్రీ కుటుంబమేశ్వర మహాదేవుడు నిత్యం భక్తులతో పూజలను అందుకుంటున్నాడు.

శివాలయంలోని అర్చకులు చెప్పిన దానీ ప్రకారం ఈ దేవాలయం సింహపురిలో ఉన్న అతి పురాతనమైన శివాలయ నిర్మాణం అని చెబుతున్నారు.

దేవాలయ గర్భగుడిలో మొత్తం మూడు శివలింగాలు ప్రతిష్టించారు.మధ్యలో పంచముఖి శివలింగం ఉంది.ఈ శివలింగానికి( Shiva lingam ) నాలుగు దిశలుగా నాలుగు ముఖాలు ఉన్నాయని, ఒక ముఖం పై వైపు ఉంటుందని తెలిపారు.

ఈ దేవాలయంలో శివలింగానికి కుడి ఎడమవైపు ఉన్న రెండు శివలింగాలు శివలింగం రూపంలో శివపార్వతుల( Lord shiva ) తనయులైన గణేశుడు, కార్తికేయుడు అని నమ్ముతారు.భైరవుడు, శ్రీ సిద్ధి వినాయకుడు, అష్ట భైరవులలో ఒకరైన భద్రకాళీ మాత, శంకరాచార్య విగ్రహం కూడా దేవాలయం లో దర్శనమిస్తాయి.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్6, ఆదివారం 2024

చాలా పురాతనమైన ఈ దేవాలయంలో నంది విగ్రహం నాలుగు స్తంభాల మధ్య కొలువై ఉన్న శివయ్యను దర్శించుకుంటూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ మహాదేవుని దర్శనం చేసుకున్న వారి కుటుంబం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

Advertisement

అదే సమయంలో మనిషి చాలా రకాల వ్యాధుల నుంచి విముక్తి పొంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు దూరమైపోతాయని నమ్ముతారు.

తాజా వార్తలు