ఈ గొర్రెని కొనాలంటే మీ ఆస్తులను అమ్ముకోవాలి... రు. 2 కోట్లు ఉంటుంది మరి!

అవును, ఇక్కడ మీరు విన్నది నిజమే.ఈ గొర్రెని కొనాలంటే మీ ఆస్తుపాస్తులను అమ్ముకోవలసి ఉంటుంది.

 To Buy This Sheep You Have To Sell Your Property... Rs. There Will Be 2 Crores S-TeluguStop.com

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడో ఒక మూలన జరిగిన ఘటనలు కూడా క్షణకాలు వ్యవధిలో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి.ఈ క్రమంలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.

దాంతో అది కాస్త వైరల్ అవుతోంది.ఆస్ట్రేలియాకు చెందిన ఎలైట్ జాతికి చెందిన ఒక గొర్రె గురించి వార్త వైరల్ గా మారిపోయింది.

అదేంటి గొర్రె గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది అని అనుకుంటున్నారు కదా.అక్కడికే వస్తున్నా.

ఇటీవల వేలంపాటలో సదరు గొర్రె పలికిన రికార్డు ధర తెలిసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు.వేలంపాటలో ఏకంగా ఎలైట్ జాతికి చెందిన గొర్రెను ఆస్ట్రేలియన్ వైట్ సిండికేట్ కు చెందిన వ్యక్తులు రెండు కోట్లకు దక్కించుకోవడం గమనార్హం.

గొర్రెకు రెండు కోట్లు పెట్టారా? ఆ డబ్బులతో ఇంకేదైనా వ్యాపారం చేసి ఉంటే బాగుండేది లేదంటే అదే డబ్బులతో వేల గొర్రెలను కూడా కొనే అవకాశం ఉంది అని అంటారు ఈ విషయం తెలిసిన వారు ఎవరైనా కదా.

Telugu Latest, Sheep-Latest News - Telugu

అయితే ఎలైట్ జాతికి చెందిన గొర్రె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రెలలో ఒకటిగా నిలిచిపోయింది.అయితే జన్యుపరంగా వ్యాధి నిరోధక శక్తి ఈ గొర్రెకు ఎక్కువగా ఉంటుందట.అంతేకాదు వేగంగా ఎదుగుతుందట.

ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే గొర్రె యజమాని కూడా అంత ధర రావడం పట్ల ఆశ్చర్యపోయాడట.ఆస్ట్రేలియాలో గొర్రెల మాంసం పరిశ్రమ పెరుగుతుంది.

కాగా శరీరంపై బొచ్చు లేని కారణంగానే ఈ గొర్రెకు మంచి డిమాండ్ ఉందని తెలుస్తోంది.గతంలో ఇదే జాతికి చెందిన ఒక గొర్రె 1.25 కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube