నిద్రలేమి సమస్యా? ఇవిగో చిట్కాలు

రాత్రి 12 అవుతుంది, నిద్రేమో పట్టదు.పోని 7-8 గంటల నిద్ర కవర్ చేసేలా ఆలస్యంగా లేద్దామా అంటే కుదరదు.

పొద్దున్నే లేచి ఆఫీసుకో, కాలేజికో వెళ్ళాల్సిందే.నిద్ర పట్టదు, కనుల కింద వలయాలు, డిప్రెషన్, ఆరోగ్య సమస్యలు .ఒకటి రెండేంటి .నిద్రలేమి వలన రాని సమస్యే లేదు.మరి ఈ నిద్రలేమి ఎలా దూరం చేసుకోవాలి? సుఖమైన, నిండైన నిద్ర ఎలా పొందాలి ? ఇవిగో చిట్కాలు.* పడుకునే ముందు స్నానం చేసుకోవడం అలవాటు చేసుకోండి.

రోజంతా పడ్డ టెన్షన్, స్ట్రెస్ అంతా ఒక్క దెబ్బతో వెళ్ళిపోయి నిద్రపడుతుంది.* లైట్ మ్యూజిక్ వినండి.

మీకిష్టమైన సంగీతం.రాక్ మ్యూజిక్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Advertisement

మెలోడి మాయలో, అలా అలా నిద్రలోకి జారుకుంటారు.* బెడ్ రూమ్ లో టీవీ , కంప్యూటర్ లాంటివి పెట్టుకోవద్దు.

మన నిద్రను చెడగొట్టేవే అవి.* 20 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ మీ గదిలో ఉంటే, నిద్ర కష్టంగానే పడుతుంది.ఏసి వాడతారో, ఫ్యాన్ తో సరిపెడతారో, లేక మీ రూమ్ లో వేడి లేకుండా ఏవైనా జాగ్రత్తలు తీసుకుంటారో మీ ఇష్టం.

* రోజంతా ఏం జరిగింది అనే అలోచనలు నెమరు వేయడం మానెయ్యండి.* వదులుగా ఉండే బట్టలు తొడుక్కోని నిద్రపోవాలి.అసలు బట్టలే లేకుండా పడుకుంటే ఇంకా మంచిది.

ఏదైనా మీ వీలునుబట్టి.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు