క్యాలిఫ్లవర్ పంటకు చీడపీడలు ఆశించకుండా ముందస్తు చర్యలు..!

క్యాలి ఫ్లవర్ పంట( Cauliflower ) సాగులో కొన్ని మెళుకువలు పాటిస్తేనే అధిక దిగుబడి సాధించడానికి వీలుంటుంది.పంటను ఒకేసారి కాకుండా విడతల వారీగా సాగు చేయడం వల్ల ఆదాయం లాభదాయకంగా ఉంటుంది.

 Tips For Cauliflower Farming,cauliflower Farming,cauliflower, Farming,agricultur-TeluguStop.com

తేమ, చల్లని వాతావరణం ఈ పంట సాగుకు చాలా అనుకూలం.

Telugu Agriculture, Black Soil, Cauliflower, Tips-Latest News - Telugu

ఈ పంట సాగుకు నల్లరేగడి( Black Soil ), ఎర్ర నేలలు అనువైనవి.వేసవికాలంలో రెండుసార్లు దుక్కి దున్నుకున్న తర్వాత చివరి దుక్కిలో ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువుతో పాటు 40 కిలోల పోటాష్, 40 కిలోల భాస్వరం వేసుకొని కలియ దున్నుకోవాలి.ఒక ఎకరంలో సాగుకు 300 గ్రాముల విత్తనాలు అవసరం.

విత్తెముందు ఒక కిలో విత్తనాలకు మూడు గ్రాముల కార్బం డిజమ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

నారుమడులను 15 సెంటీమీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి.

అప్పుడే నీరు నిల్వ ఉండకుండా బయటకు వెళ్ళిపోతుంది.విత్తనాలు చల్లిన తర్వాత నారుమడులను వరిగడ్డితో కప్పి ఉంచాలి.నారుదశలో ఏవైనా చీడపీడలు ఆశిస్తే ఒక లీటరు నీటిలో 2.5 మి.లీ మాలాథియాన్ ను కలిపి పిచికారి చేయాలి.

నారు మొక్కలకు 25 రోజుల వయసు వచ్చాక ప్రధాన పొలంలో నాటుకోవాలి.

పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకొని, వారానికి ఒకసారి నీటి తడిని అందించాలి.ఇక కలుపు నివారణ కోసం మొక్కలు నాటిన 24 గంటల లోపు ఒక ఎకరానికి 1.2 లీటర్ల అలాక్లోర్ ను ఇసుకలో కలుపుకొని తేమగల నేలపై చల్లాలి.పిచికారి చేయకూడదు.

Telugu Agriculture, Black Soil, Cauliflower, Tips-Latest News - Telugu

క్యాలీఫ్లవర్ కోత( Cauliflower Farming )కు ఒక వారం ముందు పువ్వును మొక్క యొక్క ఆకులతో కప్పి ఉంచాలి.ఇలా చేస్తే పువ్వు తెల్లగా, మచ్చలు లేకుండా నాణ్యతగా ఉంటుంది.పంటకు వివిధ రకాల చీడపీడలు ఆశించకుండా ఉండాలంటే ముందుగా పొలంలో బోరాన్ లోపం ఉందో లేదో పరీక్షించాలి.పోరాన్ లోపం ఉంటే ఒక లీటరు నీటిలో నాలుగు గ్రాముల బోరాక్స్ ను మొక్కలు నాటిన పది రోజుల తర్వాత, పువ్వు ఏర్పడడానికి 10 రోజుల ముందు మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేస్తే వివిధ రకాల చీడపీడలు పంటను ఆశించే అవకాశం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube