క్యాబేజీ పంట నిల్వలో తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు..!

పంటను సాగు చేయడంతో పాటు నిల్వ ఉంచడంలోనూ జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిందే.కొంతమంది రైతులు కష్టపడి పండించిన పంటను నిల్వ చేసుకోవడం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల నిల్వ ఉంచిన పంట చెడిపోవడం జరుగుతుంది.

 Tips For Cabbage Farming,cabbage Farming,cabbage, Farming,agriculture,farmers-TeluguStop.com

కాబట్టి పంట ఏదైనా నిల్వ చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.మార్కెట్లో క్యాబేజీకి ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.

రైతులు( Farmers ) క్యాబేజీ పంటను పండించి నిల్వ చేయడం పట్ల అవగాహన లేకపోవడం వల్ల నష్టాలను చవిచూస్తున్నారు.క్యాబేజీని ఎలా నిల్వ చేయాలో అనే జాగ్రత్తలు చూద్దాం.

Telugu Agriculture, Cabbage, Farmers, Tips Cabbage-Latest News - Telugu

ముఖ్యంగా క్యాబేజీ పంట( Cabbage )కు తేలికపాటి నేలలు చాలా అనుకూలం.ఇసుక నేలలు కూడా క్యాబేజీ పంటకు అనుకూలమే కానీ పంట కాస్త ఆలస్యంగా చేతికి వస్తుంది.సీజన్కు అనుగుణంగా పండిస్తేనే లాభాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి.క్యాబేజీ పంటకు సూక్ష్మజీవుల ముట్టడి( Bacteria ) యొక్క జీవక్రియ కార్యకలాపాలను నియంత్రించడం, షెల్ఫ్ జీవితాన్ని పెంచడం వల్ల పంట త్వరగా చెడిపోకుండా ఉంటుంది.

క్యాబేజీ పంట 0° ల వద్ద పాడు అవ్వదు కాబట్టి నిల్వ చేసే గది ఉష్ణోగ్రత 0° డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి.కోతకు వచ్చే క్యాబేజీ రకాలను ముందు 0°-1.7 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 92-95% సాపేక్ష ఆర్ద్రతతో నాలుగు నుండి ఆరు వారల వరకు నిల్వ చేయాలి.కోత మంచిగా చేస్తే నిల్వ కూడా బాగుంటుంది.

Telugu Agriculture, Cabbage, Farmers, Tips Cabbage-Latest News - Telugu

దీర్ఘ చతురస్రాకారం( Rectangular Field )లో ఉండే గదిలో క్యాబేజీ పంటను నిల్వ చేయాలి.ఇటుక గోడలు, సిమెంట్ మరియు ఇసుకతో తయారు చేసిన గదులలో నిల్వ చేయాలి.గోడల మధ్య దూరం కనీసం 7.6 సెంటీమీటర్లు ఉండాలి.స్టోర్ చేసే గది యొక్క ఎత్తు 15 సెంటీమీటర్లు ఉండాలి.నిలువ చేసిన స్టోర్ పై రోజుకు రెండు లేదా మూడుసార్లు పలుచగా నీళ్లను చల్లాలి.ఇలా చేస్తే పంట తేమ కోల్పోకుండా తాజాగా, నాణ్యతగా ఉంటుంది.వేసవికాలంలో గది ఉష్ణోగ్రత లోపల 95% సాపేక్ష ఆర్ద్రత బయట కంటే 15 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఇలా చేస్తే చాలాకాలం వరకు పంట చెడిపోకుండా, ఫ్రెష్ గా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube