సోషల్ మీడియాలో బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ వీడియోలను చాలా మంది చూసే ఉంటారు.లావుగా ఉన్న వ్యక్తులు చాలా కష్ట పడి, ఎంతో శ్రమించి మంచి కండలు తిరిగి కనిపిస్తారు.
కండలు తిరిగిన దేహంతో సూపర్ హ్యాండ్సమ్ లుక్ తో అదరగొడతారు.ఫ్యాట్ గా ఉన్నప్పుడు, బాడీ ఫిట్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో చూపిస్తుంటారు.
వాళ్లు ఎలా కష్ట పడింది, ఎలాంటి వర్కవుట్స్ చేసింది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటారు.ఆ వీడియోలు, ఫోటోల్లో వాళ్ల బాడీ ఎలాంటి ట్రాన్స్ ఫార్మ్ అవుతుందో తెలిసిపోతుంది.
అలాంటి వీడియోలు సోషల్ మీడియా వాడే వారికి కనిపించే ఉంటాయి.
అయితే ఇలాంటి వీడియోలను చాలా మంది లైట్ తీసుకుంటారు.
కొంత మంది మాత్రమే సీరియస్ గా తీసుకుని వాళ్లూ కష్టపడతారు.అయితే లావుగా ఉన్న వాళ్లు ఫిట్ గా అవ్వడం అంత తేలికైన విషయమేమీ కాదు.
దానికి ఎంతో కృషి కావాలి.చాలా శ్రమ పడాలి.
సాధించాలన్న కసి ఉండాలి.అవి ఉంటేనే ఇలాంటివి చేయగలం.
అయితే ఓ వ్యక్తి గతంలో 114 కిలోలు ఉండే వాడు.స్నేహితులు తెలిసిన వాళ్లు గేలి చేసే వారు.
కానీ అతను పెద్దగా పట్టించుకోలేదు.చూస్తుండగానే 114 కిలోల వరకు పెరిగిపోయాడు.
లావుగా ఉన్నావు అంటూ అతని గర్ల్ ఫ్రెండ్ సైతం గేలి చేసింది.అతడిని వదిలి వెళ్లి పోయింది.

అప్పుడు అతడిలో కసి రేగింది.ఎలాగైనా ఫిట్ గా అవ్వాలని కంకణం కట్టుకున్నాడు.చేసి తీరాలని రోజూ శ్రమ పడ్డాడు.ఒకటీ రెండు రోజులు గర్ల్ ఫ్రెండ్ మీద ఉన్న కోపంతో జిమ్ కు సక్రమంగా వెళ్లి కసరత్తులు చేశాడు.రోజులు గడుస్తున్న కొద్దీ కసి తగ్గిపోయేది.జిమ్ కు వెళ్లాలన్న ఆసక్తి తగ్గేది.కానీ తనకు తాను అనుకున్నది సాధించాలని ప్రోత్సహించుకున్నాడు.114 కిలోలు ఉండే ఆ వ్యక్తి ఇప్పుడు 74 కిలోలకు చేరాడు.