బాలీవుడ్ క్రేజీ కపుల్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు ఇన్నాళ్లు కలిసి తిరిగి ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్న విషయం తెలిసిందే.ఆల్రెడీ ఈ విషయంపై మీడియా వార్తలు రాసుకొచ్చింది.
ఇదిలాఉంటే రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న టైగర్ ష్రాఫ్ అసలు దిశా తన గాళ్ ఫ్రెండ్ కాదు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని షాక్ ఇచ్చాడు.కాఫీ విత్ కరణ్ షోలో టైగర్ దిశా పటాని గురించి చెప్పాడు.
తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని మైండ్ బ్లాక్ చేశాడు.
ముంబైలో వీరిద్దరు కలిసి చేసిన రచ్చ అంతా తెలిసిందే.
టైగర్ ఎక్కడ ఉంటే దిశా పటాని అక్కడ కనిపించేది.ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
ఇద్దరు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు.తీరా ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అనుకునే సరికి తూచ్ మేం ఫ్రెండ్స్ మాత్రమే అంటున్నారు.
టైగర్ ఇచ్చిన షాక్ కి దిశా ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.అయితే టైగర్ తో రిలేషన్ పై దిశా మాత్రం ఇప్పటివరకు రెస్పాండ్ అవలేదు.
కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్లారు కదా అంటే తమ అభిరుచిలు కలిశాయి.జస్ట్ కలిసి రెస్టారెంట్ కి వెళ్లి తిన్నాం అంతే తప్ప మామధ్య ఎలాంటి రిలేషన్ లేదని తేల్చి చెప్పాడు టైగర్ ష్రాఫ్.
.






