ప్రత్తిపాడులో పులి ప్రజలను బయపెడుతోంది.. మీరొకసారి రండీ అంటూ అనన్య నాగళ్లకు రిక్వెస్ట్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అనన్య నాగల్ల.

తెలంగాణ భాషతో అతి తక్కువ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాలలో మంచి నటిగా నిలిచింది ఈ తెలుగు అమ్మాయి.

తన అందంతో మాత్రం యువతను కట్టిపడేసి తన వైపు మలుపుకుంది.మొదట ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అనన్య.

ఈ సినిమాలో మల్లేశం భార్య పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో అనన్య కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పవచ్చు.

ఇండస్ట్రీకి ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత సక్సెస్ అందుకొని ఇక్కడ వరకు చేరుకుంది.ఆ తర్వాత ప్లే బ్యాక్ సిరీస్ లో నటించి అందులో కూడా మంచి గుర్తింపు అందుకుంది.

Advertisement
Tiger Is Scaring People In Pratipada Netizens Are Request To Come Ananya Nagalla

ఇక వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరగటంతో అందరికీ తన అందాలతో ఒకేసారి షాక్ ఇచ్చింది.తెలుగు అమ్మాయిగా పద్ధతిగా కనిపించిన అనన్య ఇప్పుడు గ్లామర్ షో తో బాగా పిచ్చెక్కిస్తుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారి ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫోటోను నెట్టింట్లో పెట్టేసి అందరి దృష్టిలో పడుతుంది.ఇక ఈ అమ్మడు నడుము అందాలతో మాత్రం యువతను కన్నార్పకుండా చేస్తుంది.

దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకున్నా కూడా.

ఒక రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తుంది అని తెలిసింది.ఈ బ్యూటీ తన సమయాన్ని ఎక్కువగా ట్రిప్స్, ఫోటో షూట్ లతో కాలక్షేపం చేస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇదిలా ఉంటే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఏకంగా చాలా పెద్ద ధైర్యం చేసిన సంగతి తెలిసిందే.పులి బోనులోకి వెళ్లి దానితో గేమ్స్ ఆడుతూ ఫోటోలు కూడా దిగింది.

Tiger Is Scaring People In Pratipada Netizens Are Request To Come Ananya Nagalla
Advertisement

ఇక దానికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేసుకోగా.ప్రస్తుతం అది బాగా వైరల్ గా మారింది.ఇక ఆ వీడియో చూసిన నెటిజనులు తన ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

ఇక ఓ నెటిజన్ మాత్రం తన ధైర్యానికి ఒక రిక్వెస్ట్ చేశాడు.ఇంతకు ఆ రిక్వెస్ట్ ఏంటంటే.

రియల్లీ గ్రేట్ మీరు.కానీ మీ నుంచి చిన్న హెల్ప్ కావాలి.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లో పులికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.మీరు వచ్చి ఆ పులిని మచ్చిక చేసుకొని ఆ పులితో అచ్చిక బుచ్చిలాడి ఆ పులిని అడవి శాఖ కు అప్పజెప్పితే అక్కడ ప్రజలు సురక్షితంగా ఉంటారు.

మీ పేరు మా జిల్లాలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది.ప్లీజ్ దయచేసి ఆవు పులి ని అడవి శాఖకు అప్పగించండి అని కామెంట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

తాజా వార్తలు