కూటమి పార్టీల్లో టికెట్ల రచ్చ : అన్ని చోట్లా గందరగోళమే 

ఏపీలో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా టిడిపి, జనసేన, బిజెపిలు కూటమిగా ఏర్పడ్డాయి.

మూడు పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకుని దాదాపుగా అభ్యర్థుల జాబితాను అన్ని పార్టీలు ప్రకటించాయి.

ఈ సర్దుబాటు వ్యవహారంలో మూడు పార్టీల కు పెద్ద తలనొప్పులే వచ్చి పడ్డాయి.పొత్తులో భాగంగా సీట్లు త్యాగాలు చేసిన వారంతా ఇప్పటికీ అసంతృప్తిగానే ఉండడం, కొంతమంది బహిరంగంగా తమ పార్టీ పైనే విమర్శలు చేయడం, మరి కొంతమంది రెబల్ గా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడం వంటివన్నీ ఇబ్బందికరంగా మారాయి.

  కొన్నిచోట్ల టిక్కెట్లు దక్కలేదని , మరోచోట రెబల్ అభ్యర్థులు బరిలో ఉండడంతో,  కేడర్ లోనూ అయోమయం నెలకొంది.ఈ ప్రభావం  కూటమి ఐకమత్యం పై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది.

ఇప్పటివరకు చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి రాజుకుని ఇంకా చల్లారలేదు.పార్టీ కీలక నాయకులు రంగంలోకి దిగి వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం అంతంత మాత్రమే అన్నట్లుగా కనిపిస్తోంది.

Advertisement

ఈ తరహా అసంతృప్తులను బుజ్జగించేందుకు ఇప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అసంతృప్త నేతలను పిలిచి బుజ్జిగించే ప్రయత్నం చేస్తున్నారు.అయినా ఫలితం అంతంత మాత్రమే అన్నట్లుగా కనిపిస్తోంది .

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో బిజెపి అభ్యర్థి , మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజు,  బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.అయితే శివరామకృష్ణంరాజు ( Mulagapati Sivarama Krishnamraj )ప్రచారాన్ని టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి.ఎన్నికల నామినేషన్ పత్రాలు దాఖలు చేసే వరకు టిడిపి కండువా మెడలో వేసుకోవద్దంటూ వారు వాగ్వాదానికి దిగారు.

దీంతో కండువా తీసేసి ప్రచారానికి ఆయన వెళ్తున్నారు.ఇక్కడ టిడిపి టికెట్ ఆశించి భంగపడిన నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారు .తనకే టికెట్ దక్కే ఛాన్స్ ఉందని, ఇప్పటికీ ఆయన పార్టీ శ్రేణులకు చెబుతూనే వస్తూ ఉండడంతో బీజేపీ ఇక్కడ డైలమాలో పడింది.నెల్లూరు జిల్లా కావలిలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది.

 టిడిపి టికెట్ కోసం ప్రయత్నం చేసిన పసుపులేటి సుధాకర్( Pasupuleti Sudhakar ) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.టిడిపి టికెట్ విషయంలో తనను మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా తణుకు విషయానికి వస్తే జనసేన టికెట్ తనకేనని స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినా పొత్తులో భాగంగా ఇక్కడి సీటును టిడిపికి కేటాయించడంపై జనసేన నేత విడివాడ రామచందర్రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

ఆయనతో పార్టీ నేతలు చర్చలు జరిపినా,  టిడిపి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి పనిచేసేందుకు ఆయన ఇష్టపడడం లేదు .ఈ మేరకు పవన్ , చంద్రబాబు తణుకులో పర్యటించిన సందర్భంగా ప్లకార్డులు పట్టుకుని విడివాడ రామచందర్రావు అనుచరులు తమ నిరసనలు వ్యక్తం చేశారు .పాడేరు లోను ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది.ఇక్కడ టిడిపి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కి టికెట్ దక్కకపోవడం తో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

 ఇప్పటికే దీనిపై అనుచరులతో సమావేశం నిర్వహించి ,తానే రెబల్ గా పోటీ చేయబోతున్నట్లు ఈశ్వరి ప్రకటించారు.ఇలా చెప్పుకుంటూ వెళ్తే.  చాలా నియోజకవర్గాల్లో ఈ తరహా అసంతృప్తులు ఉన్నాయి.

పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు సీట్లు కేటాయింపు పై అటు టిడిపి, ఇటు జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది.

తాజా వార్తలు