ఈ మూడు మీ డైట్‌లో ఉంటే థైరాయిడ్‌ను సుల‌భంగా నియంత్రించవచ్చు!

ప్ర‌స్తుత రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా కోట్లాది మంది థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు.హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం అనేవి చాలా కామన్‌గా వేధించే థైరాయిడ్ డిసార్డర్స్.

థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడాన్ని హైపర్‌థైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్ త‌క్కువ‌గా విడుదల కావడాన్ని హైపోథైరాయిడిజం అని అంటారు.అయితే థైరాయిడ్ ఏదైనా ఒక్క‌సారి వ‌చ్చిదంటే జీవిత కాలం వేధిస్తూనే ఉంటుంది.

పొర‌పాటున దాన్ని నిర్ల‌క్ష్యం చేశామా.? ఇక అంతే సంగ‌తులు.అది మ‌రింత తీవ్ర‌త‌రంగా మారుతుంది.

దాంతో బ‌రువు పెరిగిపోవ‌డం, నీర‌సం, అల‌స‌ట‌, ఆయాసం, చ‌ర్మం పొడి బారిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, వణుకు, మ‌ల‌బ‌ద్ధ‌కం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సంతాన‌లేమి ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తుతుంటాయి.అందుకే థైరాయిడ్‌ను నియంత్రించుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.

Advertisement

అందుకే ఇప్పుడు చెప్పుడు మూడు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి లేటెందుకు అవేంటో ఓ చూపు చూసేయండి.

ప‌సుపు. దీని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

ఎన్నో అమోఘ‌మైన పోష‌కాలు, ఔష‌ధ గుణాలు నిండి ఉండే ప‌సుపుకి థైరాయిడ్‌ను నియంత్రించే సామ‌ర్థ్యం కూడా ఉంది.అందుకే ప‌సుపును ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కొబ్బ‌రి నూనె. ఇది మీ డైట్‌లో ఉంటే థైరాయిడ్‌ను సుల‌భంగా నియంత్రించవచ్చు.ముఖ్యంగా రోజూ ఉద‌యాన్నే ఒక‌టి లేదా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనెను సేవించాలి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఇలా చేస్తే కొబ్బ‌రి నూనెలో ఉండే ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు థైరాయిడ్ హార్మోన్‌ ఉత్పత్తికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.పైగా కొబ్బ‌రి నూనె బరువు తగ్గడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.

Advertisement

ఆపిల్ సైడర్ వెనిగర్..థైరాయిడ్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఇది చాలా మేలు చేస్తుంది.

రోజు గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వ‌న్‌ స్పూన్ ఆపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి తీసుకుంటే థైరాయిడ్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.బాడీ డిటాక్స్ అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.

మ‌రియు చ‌ర్మ ఆరోగ్యం సైతం మెరుగ్గా మారుతుంది.

తాజా వార్తలు