ప్రేమదేశం మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ప్రేమదేశం. యువతను ఆకట్టుకునే కథతో రూపొందిన ఈ సినిమాలో మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య తదితరులు ప్రధాన పాత్రలో నటించారు.

 Thrigun Megha Akash Premadesam Movie Review And Rating Details, Premadesam Movie-TeluguStop.com

సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై శిరీష సిద్ధమ్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

డిఫరెంట్ ప్రేమ కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక కథ లోకి వెళ్తే కాలేజ్ లో చదువుకుంటున్న అర్జున్ (త్రిగున్),ఆద్య (మేఘా ఆకాష్) లకు ఒకరంటే ఒకరరికి ఇష్టం.

కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోతారు.అయితే కాస్త ధైర్యం చేసి ఇద్దరు ఫిబ్రవరి 14 లవర్స్ డే న ఒక దగ్గర కలుసుకొని ప్రపోజ్ చేసుకుందామని అనుకుంటారు.

ఇక ఆ ప్లేస్ పేరే ” ప్రేమ దేశం”. అయితే ఆరోజు వారికి యాక్సిడెంట్ అవుతుంది.ఇక మరోవైపు రిషి (అజయ్ కతుర్వాల్) అనే అబ్బాయి మూడు సంవత్సరాల నుండి మాయ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఆమెను తనకు పడేలా ప్రయత్నం చేస్తుంటాడు.

Telugu Ajay Katurwar, Madhubala, Maya, Megha Akash, Premadesam, Thrigun-Movie

దీంతో మాయ కూడా అతని ప్రేమలో పడగా.దాంతో రిషి , మాయల పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది.ఇక మరో వైపు పెళ్లి పెళ్లి అని తిరుగుతూ పెళ్లిచేసుకోవాలనే కోరిక ఉన్న శివకు అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి శివ నచ్చడు.

ఇక తనను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని వచ్చిన అమ్మాయి శివకు నచ్చదు.అయితే కొన్ని కారణాలతో మాయతో శివ పెళ్లి ఫిక్స్ అవుతుంది.ప్రేమించిన రిషితి తాళి కట్టించుకోవాల్సిన మాయ శివను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్దపడింది.అర్జున్, ఆద్య ల యాక్సిడెంట్ కు శివ, రిషి , మాయల మధ్య ఉన్న సంబంధం ఏంటి చివరికి ఏం జరుగుతుంది అన్నది మిగిలిన కథలోనిది.

Telugu Ajay Katurwar, Madhubala, Maya, Megha Akash, Premadesam, Thrigun-Movie

నటినటుల నటన:

నటీనటులంతా పాత్రకు పూర్తి న్యాయం చేశారని చెప్పాలి.త్రిగున్, మేఘ ఆకాష్ తమ పాత్రతో ఈ సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లారని చెప్పాలి.మధుబాల మాత్రం తన నటనతో బాగా ఆకట్టుకుంది.అజయ్, శివ, తనికెళ్ల భరణి తదితరులు అద్భుతంగా నటించారు.

టెక్నికల్:

డైరెక్టర్ ఈ సినిమాకు మంచి కథను అందించాడు.యూత్ ను ఆకట్టుకునే విధంగా రూపొందించాడు.

ఈ సినిమాతో శ్రీకాంత్ దర్శకుడుగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.సజాద్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది.టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

Telugu Ajay Katurwar, Madhubala, Maya, Megha Akash, Premadesam, Thrigun-Movie

విశ్లేషణ:

ఈ సినిమాను డైరెక్టర్ ఎటువంటి బోరింగ్ ఫీలింగ్ లేకుండా చూపించాడు.లవ్ ని డిఫరెంట్ యాంగిల్ లో చూపించాడు.ప్రారంభం నుండి చివరి వరకు సినిమాను చాలా నీట్ గా చూపించాడు.

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ, నటీనటుల నటన, సంగీతం, ఎమోషనల్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపించాయి.

బాటమ్ లైన్:

చివరగా చెప్పాల్సిందేంటంటే ఒక అందమైన ప్రేమ కథలతో ఈ సినిమా వచ్చిందని చెప్పాలి.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube