చరణ్ 'ఆర్సీ15' కోసం మూడు క్రేజీ టైటిల్స్.. త్వరలోనే అనౌన్స్ మెంట్!

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

 Three Titles In Under For Charan And Shankar Project, Rc15 , Ram Charan , Director Shankar , Kiara Advani , Rc15 Movie Title-TeluguStop.com

ఈ సినిమా తో చరణ్ హిట్ కొట్టాడు కానీ ఇది సోలో హిట్ కాదు.ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమాతో అయితే మెగా ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశ పరిచాడు.

అందుకే మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా తెరకెక్కుతుంది.

 Three Titles In Under For Charan And Shankar Project, RC15 , Ram Charan , Director Shankar , Kiara Advani , RC15 Movie Title-చరణ్ ఆర్సీ15#8217; కోసం మూడు క్రేజీ టైటిల్స్.. త్వరలోనే అనౌన్స్ మెంట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శంకర్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.ఈయన సినిమాలు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్నాయి.

ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.ఆ తర్వాత వైజాగ్ బీచ్ లో షూటింగ్ జరుపుకుంది.

ఇక ఇక్కడ కూడా షూటింగ్ అయిపోవడంతో నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తారో చూడాలి.

ఇది పక్కన పెడితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మూడు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ను అనుకుంటున్నట్టు తెలుస్తుంది.ఈ మూడు టైటిల్స్ లో కూడా ఒక టైటిల్ నచ్చడంతో దానిని కన్ఫర్మ్ చేశారట.

ఈ టైటిల్ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఈయన కెరీర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇది ఈయనకు 50వ సినిమా కావడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube