చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అరవపల్లి వద్ద అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా… మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా మృతులు పుంగనూరుకు చెందిన కుమార్, భాగ్యరాజ్, రవిగా గుర్తించారు.
మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.