Skin Whitening Oil : స్కిన్ వైట్నింగ్ ఆయిల్ ఇది.. రోజు వాడితే ఎన్నో బెనిఫిట్స్!

సాధారణంగా చాలా మంది చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ స్కిన్ వైట్నింగ్ ఆయిల్ ను కనుక వాడితే చాలా సులభంగా చర్మాన్ని తెల్లగా మరియు కాంతివంతంగా మార్చుకోవచ్చు.మరి ఇంతకీ ఆ స్కిన్ వైట్నింగ్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు, ఒక కప్పు ఫ్రెష్ పుదీనా ఆకులు, అర కప్పు కరివేపాకు వేసుకోవాలి.అలాగే కొన్ని ఫ్రెష్ నిమ్మ తొక్కలు మరియు కొన్ని ఫ్రెష్ ఆరెంజ్ పండు తొక్కలు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ను పోసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

Advertisement

ఆపై హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్‌ వేసి మరో మూడు నిమిషాల పాటు హీట్ చేయాలి.అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయిన అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.

ఈ ఆయిల్ ను ముఖానికి మరియు బాడీ మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం స్నానం చేయాలి.రోజు ఈ విధంగా చేస్తే చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.

చ‌ర్మంపై ఏమైనా మచ్చలు ఉంటే క్రమంగా మాయం అవుతాయి.ముడతలు తగ్గుముఖం పడతాయి.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

చర్మం యవ్వనంగా మెరుస్తూ కనిపిస్తుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా సైతం ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు