ఈ న్యాచుర‌ల్ ఫేస్ మాస్క్ క్ష‌ణాల్లో మీ చ‌ర్మాన్ని బ్రైట్‌గా మారుస్తుంది!

స‌డెన్‌గా ఏదైనా పార్టీకో, ఫంక్ష‌న్‌కో, మీటింగ్‌కో వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు.ముఖం డ‌ల్‌గా ఉంటే అస్స‌లు ఒప్పుకోరు.

ఏదో ఒక‌టి చేసి ఫేస్‌ను బ్రైట్‌గా మార్చుకోవ‌డం కోసం తంటాలు ప‌డుతుంటారు.ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలు లేదా గూగుల్ చెప్పిన చిట్కాల‌ను ఫాలో అవుతూ తెగ హైరానా ప‌డిపోతుంటారు.

ఇలాంటి ప‌రిస్థితి మీకూ ఎప్పుడోక‌ప్పుడు వ‌చ్చే ఉంటుంది.అవునా.

అయితే అలాంటి టైమ్‌లో ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ అండ్ న్యాచుర‌ల్ ఫేస్ మాస్క్‌ను ట్రై చేస్తే క్ష‌ణాల్లో మీ ముఖ చ‌ర్మం బ్రైట్‌గా మ‌రియు ఎట్రాక్టివ్‌గా మారుతుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఫేస్ మాస్క్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

Advertisement

ముందుగా నీటిలో శుభ్రంగా క‌డిగిన ఒక ట‌మాటోను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ నుండి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ట‌మాటో జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ జెల‌టిన్ పౌడ‌ర్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ గిన్నెను మ‌రుగుతున్న నీటిలో పెట్టుకుని.

డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో ఉడికించుకోవాలి.ఇలా ఉడికించుకున్న మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌నిచ్చి.

అప్పుడు అందులో వ‌న్ టేబుల్ స్పూన్ చార్కోల్ పౌడ‌ర్‌, పావు స్పూన్ ఆర్గానిక్ ప‌సుపు వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

పూర్తిగా డ్రై అయ్యేంత‌ వ‌ర‌కు ఆగాలి.ఆపై ఫేస్ మాస్క్‌ను సున్నితంగా తొల‌గించి.

Advertisement

వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఈ ఫేస్ మాస్క్‌.మృత క‌ణాల‌ను, మ‌లినాల‌ను తొల‌గించి ముఖాన్ని బ్రైట్‌గా, షైనీగా మారుస్తుంది.స‌డెన్‌గా బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఈ ఫేస్ మాస్క్‌ను వేసుకుంటే డ‌ల్ స్కిన్ క్ష‌ణాల్లో ఎట్రాక్టివ్‌గా త‌యార‌వుతుంది.

తాజా వార్తలు