ఆదర్శం : అంతా కూడా ఈ తల్లిని ఆదర్శంగా తీసుకుంటే పిల్లల ఆత్మహత్యలే ఉండవు

ప్రస్తుతం అంతా కూడా పోటీ ప్రపంచం.ఒకరిని మించి ఒకరు ప్రతిభ కనబర్చితేనే ఇక్కడ లీడర్‌గా బతకగలం అని అంతా అనుకుంటూ ఉంటారు.

ప్రతి ఒక్కరు కూడా ఒకరిపై పై చేయి సాధించేందుకు విపరీతంగా కష్టపడుతూనే ఉన్నారు.ఇక పెద్ద వారు తమ పిల్లలను చిన్నప్పటి నుండే చదువులో నెం.1గా ఉండాలనే ఉద్దేశ్యంతో వారిపై చాలా ఒత్తిడి తీసుకు వస్తారు.అలా తీసుకు వచ్చిన వత్తిడి వల్ల వారు మానసికంగా చాలా హింసకు గురి అవుతారు.

ఈమద్య కాలంలో ఫెయిల్‌ అయిన పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంకు ప్రధాన కారణం తల్లిదండ్రుల ఒత్తిడి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీకి చెందిన ఒక తల్లి తన కొడుకు పదవ తరగతి ఫలితంపై చేసిన పోస్ట్‌ వైరల్‌ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఈమద్య కాలంలో తల్లిదండ్రులు 98 శాతం మార్కులు వచ్చినా కూడా మిగిలిన ఆ రెండు శాతం మార్కులు ఎందుకు తగ్గాయి అంటూ ప్రశ్నించే పరిస్థితి ఉంది.ఈసారి సీబీఎస్‌ఈ పదవతరగతి ఫలితాల్లో 13 మంది విద్యార్థులు నెం.1 ర్యాంకును పంచుకున్నారు.ఇంకా ఎంతో మంది 90 శాతంకు మించిన మార్కులు సాధించారు.

Advertisement

వారు ఎంతటి ఆనందంను వ్యక్తం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కాని ఢిల్లీకి చెందిన వందన సుఫియా మాత్రం తన కొడుకుకు 60 శాతం మార్కులు వచ్చినా కూడా నా కొడుకు బంగారం, అతడికి మంచి మార్కులు వచ్చాయంటూ గొప్పగా పోస్ట్‌ చేసింది.

మామూలుగా అయితే 60 శాతం మార్కులు వస్తే కుటుంబ సభ్యులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు.లక్షల్లో ఫీజు కడితే ఇలాగేనా మార్కులు వచ్చేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాని వందన గారు మాత్రం తన కొడుకు గొప్పదనంను పొగుడుతూ పోస్ట్‌ పెట్టింది.

ఆ పోస్ట్‌లో.నా కొడుకు తాజా ఫలితాల్లో 60 శాతం మార్కులు సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.అతడికి కొన్ని సబ్జెక్ట్‌లు కష్టం.

అయినా కూడా కష్టపడి వాటిని కూడా పాస్‌ అయ్యాడు.పరీక్షలకు ముందు నా కొడుకు చదివాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

నా కొడుకులాంటి ఇతర చిన్నారులకు నేను చెప్పేది ఒక్కటే.మీరు చేపల వంటి వారు, మిమ్ములను చెట్టు ఎక్కమంటున్నారు.

Advertisement

సాధ్యం అయినంత వరకు ప్రయత్నించండి.కాస్త ఎక్కినా మీరు విజయం సాధించినట్లే.

మీరు సముద్రంలో అత్యున్నత దూరంకు వెళ్తారని నాకు తెలుసు.నా కొడుకు అమెర్‌ చదువు కాకుండా హాస్య చతురతో నవ్విస్తాడు.

ఎప్పుడు కూడా నువ్వు నీ కాన్ఫిడెన్స్‌ మిస్‌ కాకుండా ఉండు నాప్రియమైన అమర్‌ అంటూ ఆమె పోస్ట్‌ చేసింది.ఈ పోస్ట్‌ ప్రతి తల్లిదండ్రికి కను విప్పు అవ్వాలి.

అలాంటి పద్దతిలో పిల్లలను పెంచినట్లయితే ఈ ఆత్మహత్యలు ఉండవు.అమ్మ నాన్న ఒక్క సారి ఈ విషయాన్ని ఆలోచించండి.

తాజా వార్తలు