చదువుంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.ఇక మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కుటుంబ పరిస్థితుల వలన ఎంతో మంది మహిళలు తమకు ఇష్టమైన చదువుకు దూరమై.ఇప్పటికి చదువుకోలేదని బాధపడుతుంటారు.
కానీ నేపాల్‌లో ఉన్న మహిళ అందరికంటే భిన్నంగా ఆలోచించి, తనకు చదువుపై ఉన్న మక్కువను తెలియజేసింది.అది ఎలా అనుకుంటున్నారా.
అయితే మీరే చదవండి.
ఎక్కడైనా సరే బడికి పంపే తల్లిని చూశాం.
కానీ పిల్లలతో పాటు బడికి వెళ్లే తల్లిని చూడటం ఇదే మొదటి సారేమో… చదువుకు దూరమైన మహిళ ఇప్పుడు తన పిల్లలతో కలిసి ఆనందంగా పాఠశాలకు వెళ్తోంది.
వివరాల్లోకి వెళ్లితే.
నేపాల్ దేశానికి నైరుతిలో ఉన్న పునర్బాస్ గ్రామంలో పార్వతి అనే మహిళ తన కుటుంబంతో జీవినం సాగిస్తోంది.తన 15వ ఏటా ఇంటిలో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న ఆమెకు ప్రస్తుతం ఇద్దరు కొడుకులున్నారు.
అయితే పెళ్లైన తర్వాత ఆమె తన చదువు బంద్ చేసింది.అయినా తనకు చదువు మీద ఇష్టం మాత్రం తగ్గలేదు.దీంతో తన కొడకులు చదువుకుంటున్న బడిలోనే కొడుకులతో కలిసి ఆమె బడికి వెళ్లి చదువుకుంటుంది.తన కొడుకు క్లాస్ మెంట్స్‌తో తిరిగి ఆమె తన చదువును కొనసాగిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తుంది.
తాను తప్పని సరిగా 12 తరగతి పూర్తి చేయాలని నిర్ణయించున్నట్లు తెలిపింది.ఇక ఏ కొడుకులకు కలగని అదృష్టం.రేషమన్, అర్జున్‌లకు కలిగింది.దీంతో రేషమన్ మాట్లాడుతూ.మా అమ్మ నాతో కలిసి బడికి రావడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.ఇక మహిళ చదువు కోసం పడుతున్న తపన, దానికోసం తన కొడుకులతో కలిసి యూనిఫామ్ ధరించి పాఠశాలకు వెళ్లడంతో అక్కడున్న వారందరూ మహిళను ప్రశంసిస్తున్నారు.29 మిలియన్ల మంది ఉన్న నేపాల్ దేశంలో కేవలం 57 శాతం మంది మహిళలు అక్షరాస్యులున్నారు.