జ్ఞాపకశక్తి రోజురోజుకు తగ్గుతుందా.. ఆలస్యం వద్దు వెంటనే ఇలా చేయండి!

బిజీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు.డబ్బు సంపాదనలో పడి హెల్తీ డైట్ ను మెయింటైన్ చేయలేకపోతున్నారు.

దీనికి తోడు కంటి నిండా నిద్ర లేకపోవడం, మద్యపానం ధూమపానం అలవాట్లు, ఒత్తిడి తదితర అంశాలు మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి.దీని కారణంగా ఆలోచన శక్తితో పాటు జ్ఞాపకశక్తి( Memory ) సైతం క్రమంగా తగ్గుతుంది.

మీకు కూడా రోజు రోజుకు జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు అనిపిస్తుందా.? చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా.? అయితే అస్సలు ఆలస్యం వద్దు.వెంటనే ఇప్పుడు చెప్పబోయే లడ్డూను డైట్ లో చేర్చుకోండి.

ఈ లడ్డూ మీ మెదడు పనితీరును పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ లడ్డును ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

This Laddu Helps To Boost Your Memory And Improves Brain Health , Memory Power,
Advertisement
This Laddu Helps To Boost Your Memory And Improves Brain Health , Memory Power,

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఎనిమిది డ్రై అంజీర్,( Dry Anjeer ) ప‌ది గింజ తొలగించిన ఖర్జూరం వేసుకుని వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న అంజీర్ మరియు ఖర్జూరం వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు తరిగిన బాదం, ( Almonds )ఒక కప్పు గుమ్మడి గింజలు, ఒక కప్పు తరిగిన పిస్తా, అర కప్పు తరిగిన జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు వేసి వేయించుకోవాలి.

This Laddu Helps To Boost Your Memory And Improves Brain Health , Memory Power,

ఇవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం అంజీర్ మిశ్రమాన్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలు మాదిరి చుట్టుకోవాలి.ఈ లడ్డూలను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున ఈ లడ్డూలను తినాలి.ఈ ల‌డ్డూల్లో ప్రోటీన్ తో పాటు విటమిన్ ఏ, విటమిన్ డి, విట‌మిన్ బి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోష‌కాలు పుష్కలంగా నిండి ఉంటాయి.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

ఇవి మన మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తిని రెట్టింపు చేస్తాయి.

Advertisement

ఆల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.ఈ లడ్డూను తినడం స్టార్ట్ చేశారంటే మీ బ్రెయిన్ మునుపటి కంటే షార్ప్ గా పనిచేస్తుంది.

ఇక ఈ లడ్డూతో పాటు ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు డైట్ లో ఉండేలా చూసుకోండి.కంటి నిండా నిద్రపోండి.

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.

తాజా వార్తలు