రష్యా- ఉక్రెయిన్ వార్‌ విషయంలో తటస్థంగా వ్యవహరించినందుకు ఇండియాకు దక్కింది ఇదే!

సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిని భారతదేశం సానుకూలంగా మలుచుకుందనే చెప్పుకోవాలి.

ఈ కారణంగా మిగతా దేశాలు ర్యష్యాను బ్యాన్ చేసిన నేపథ్యంలో భారత్ భారీ సబ్సిడీతో ముడి చమురును దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది.

ఈ విషయంలో ఇండియా అమెరికాను సైతం లెక్కచేయలేదు.ఐక్యరాజ్యసమితి ఓటింగ్స్‌లోనూ, రష్యాకు వ్యతిరేకంగా ఓటేయకుండా భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉంది.రాయితీ మీద రష్యా అందిస్తున్న ముడి చమురు కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో అంటే 2022 ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు చూసుకుంటే సుమారు $2.5 బిలియన్లను ఆదా చేసే అవకాశం ఉందని ఇండియాట్రేడ్ డేటా చెబుతోంది.

రష్యా వల్ల భారతదేశ పొదుపు ‍‌$2.5 బిలియన్లుగా కనిపిస్తున్నా, ఈ లెక్కని ఇంకా విడగొట్టి నిశితంగా పరిశీలిస్తే, ఊహించిన దాని కంటే చాలా తక్కువ లబ్ధి పొందినట్లు తెలుస్తోందని నిపుణుల మాట.2022 ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 కాలంలో, అన్ని దేశాల నుంచి ఇండియా దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు 99.2 డాలర్లుగా వుంది.రష్యా పంపిన క్రూడ్‌ను ఈ లెక్కల్లోంచి తీసేస్తే, సగటున ఒక్కో బారెల్‌ ధర 101.2 డాలర్లగా కనిపిస్తోంది.ఈ లెక్కన రష్యన్ చౌక చమురు దిగుమతి వల్ల భారత్‌కు సగటున మిగిలింది ఒక్కో బ్యారెల్‌కు 2 డాలర్లు మాత్రమే.

ఇక ఇతర దేశాల ముడి చమురుకు చెల్లించే సగటు ధరను, ఇండియన్‌ రిఫైనర్లు రష్యన్ చమురు కోసం చెల్లించినట్లయితే, చమురు దిగుమతి బిల్లు సుమారు 129 బిలియన్‌ డాలర్లుగా లేదా 2 శాతం ఎక్కువగా ఉండేదని విశ్లేషించి మరీ చెబుతున్నారు.ఇదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతుల విలువ సుమారు 22 బిలియన్‌ డాలర్లు.రష్యాయేతర దేశాల లెక్కలతో పోలిస్తే బ్యారెల్ ధర దాదాపు 10.3 డాలర్లు తక్కువ.ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధరపై 10.1% డిస్కౌంట్‌కు ఇది సమానం.ఈ లెక్క కూడా బాగానే కనిపిస్తున్నా, వివిధ నివేదికల్లో రాసుకొచ్చిన డిస్కౌంట్ల కంటే ఇది చాలా తక్కువ అని నిపుణుల పెదవి విరుస్తున్నారు.

Advertisement
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!

తాజా వార్తలు