సుడిగాలి సుధీర్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. తేడా కొట్టిందో అంతే సంగతులు!

బుల్లితెర కమెడియన్ గా జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో ప్రేక్షకులను సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి నటుడు సుడిగాలి సుదీర్ (Sudigali Sudheer) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా చేస్తూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిన సుడిగాలి సుదీర్ అనంతరం బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నారు.

 This Is The Title Of Sudhir Sudhir's New Movie Details, Jabardasth,sudigali Sud-TeluguStop.com

ఇలా బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈయన క్రేజ్ దృష్టిలో పెట్టుకొని తనకు సినిమా అవకాశాలను కూడా కల్పించారు.ఇప్పటివరకు సుధీర్ మూడు సినిమాలలో నటించగా ఇందులో రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయని చెప్పాలి.

Telugu Goat, Goatgreatest, Jabardasth, Naresh Kuppili, Sudheer Latest-Movie

ఇక ఈయన నటించిన గాలోడు (Gaalodu)సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో సుధీర్ కు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే సుధీర్ తాజాగా మరో సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.తమిళ నటి దివ్య భారతితో కలిసి ఈయన తన తదుపరి సినిమాలో నటించబోతున్నారు.

ఇక ఈ సినిమాకు పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి(Naresh Kuppili) దర్శకత్వం వహించడం విశేషం.ఇది సుధీర్ కు నాలుగవచిత్రం కావడం విశేషం.

Telugu Goat, Goatgreatest, Jabardasth, Naresh Kuppili, Sudheer Latest-Movie

ఇక నేడు సుధీర్ పుట్టినరోజు జరుపుకోవడంతో ఈయన సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ చిత్రానికి ‘GOAT – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ (Goat Greatest Of All Times) టైటిల్ పెట్టారు.ఈ సినిమా టైటిల్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిర్మాతలు చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ … మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అయితే ఈ రోజు టైటిల్ పోస్టర్ విడుదల చేయగా కొద్ది క్షణాల్లోనే ఈ పోస్టర్ కు మంచి ఆదరణ లభించిందనీ తెలిపారు.

అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్ తెలిసిన పలువురు ఈ సినిమా సక్సెస్ అయితే పర్వాలేదు కానీ ఏ మాత్రం తేడా కొట్టిన అంతే సంగతులు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube