ప్రపంచంలోనే అత్యంత తెలివైన పంది ఇదే.. దీని తెలివితేటలు తెలిస్తే!

సాధారణంగా ప్రజలు పిల్లులు, కుక్కలను పెంచుకుంటుంటారు.అయితే కొందరు కోతులు, గుర్రాలు, చిలుకలను కూడా పెంచుకుంటారు.

 This Is The Smartest Pig In The World , Pet Pig, Smartest Pig, Mina Alali, Tr-TeluguStop.com

విదేశాల్లో మాత్రం మొసళ్లు, సింహాలు, పులులు, హైనాలు ఇలా ఎవరూ పెంచుకోలేనటువంటి వాటిని కూడా పెంచుకుంటుంటారు.అంతేకాదు వీటికి ట్రైనింగ్ ఇచ్చి పనులు కూడా చేయిస్తుంటారు.

అయితే తాజాగా కాలిఫోర్నియాలోని ఒక మహిళ పందిని పెంచుకుంటుంది.సాధారణంగా మన ఇండియాలో పందిని ఎవరూ పెంపుడు జంతువుగా పెంచుకోరు.

కానీ అది అమెరికా కాబట్టి ఆమె పందిని పెంచుకోవడం కొత్త విషయమేమీ కాదు.విశేషమేంటంటే ఆ పంది మిగతా అన్ని పందుల కంటే చాలా తెలివైనది.

పందిని పెంచుతున్న ఆ మహిళ పేరు మినా అలాలీ.ఆమె పెంపుడు పంది పేరు మెర్లిన్.మెర్లిన్ అంటే యజమాని మినాకి చాలా ఇష్టం.ఆమె దానిని ముద్దాడుతుంది.కుక్క పిల్లలాగా ఎత్తుకొని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది.అంతేకాదు పందితోనే కలిసి నిద్రపోతుంది.2020, మార్చిలో ఒక పొలంలో ఈ పంది పిల్లను ఆమె కొనుగోలు చేసింది.దానిని కొన్న మరుసటి రోజే ఆమె దానితో ఎమోషనల్‌గా బాగా అటాచ్ అయింది.

మెర్లిన్ ఇప్పుడు 15 కిలోల బరువు, 3 అడుగుల పొడవు పెరిగింది.

మినా తన పంది మెర్లిన్‌కు ఎలక్ట్రిక్ బటన్లను ఆన్, ఆఫ్ చేయడం, డ్యాన్స్ చేయడం, కూర్చోవడం, హై ఫైవ్ ఇవ్వడంలో ట్రైనింగ్ ఇచ్చింది.ఈ పనులన్నీ పంది అవలీలగా చేయగలదు.తన మెర్లిన్‌ పంది ఒక ట్రిక్‌ని పూర్తి చేసినప్పుడు ఆమె దానికి కుక్కీలు, ముద్దులు ఇచ్చి సంతోష పెడుతుంది.

మినా ప్రకారం, మెర్లిన్‌కి శిక్షణ ఇవ్వడానికి ఒక్క రోజు కంటే ఎక్కువ సమయం పట్టలేదు.కొద్ది రోజులుగా మినా తన టిక్‌టాక్ అకౌంట్‌లో మెర్లిన్ వీడియోలను పోస్ట్ చేస్తోంది.

ఆ వీడియోల లో పంది హై-ఫైవ్‌ ఇవ్వడం, కూర్చోమంటే కూర్చోవడం, డ్యాన్స్ చేయడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మినాకి టిక్‌టాక్‌లో 10 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.

ఆ టిక్‌టాక్ ఫాలోవర్లు మెర్లిన్‌ను ప్రపంచంలోనే అత్యంత తెలివైన పంది అని పిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube