గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్( Guinness World Records ) పేరిట ప్రతీ ఏటా ఎన్నో రంగాల్లో వివిధ కళాకారులు తమ సత్తాని చాటుతూ వుంటారు.ఈ క్రమంలో ఒకరిని మించి మరొకరు రికార్డ్స్ సృష్టిస్తూ వుంటారు.తాజాగా ప్రపంచంలోనే అతి చిన్న చెక్క చెంచాను తాయారు చేసిన ఓ భారతీయుడు పాత రికార్డును బద్దలుకొట్టాడు.25 ఏళ్ల శశికాంత్ ప్రజాపతి అనే వ్యక్తి.చెక్కతో 1.6 మిల్లీమీటర్ల బరువుతో కూడిన అతి చిన్న చెక్క చెంచాను తయారు చేసాడు.దాంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించాడు.కాగా అతను గత రికార్డు దారుడైన నవరతన్ ప్రజాపతి మూర్తికర్ ( Navrathan Prajapati Murthikar )2 మిల్లీమీటర్ల చెంచా చెక్కి నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు.
అయితే ఇదొక రికార్డా అని తేలిగ్గా కొట్టి పారేయొద్దు.ఈ రికార్డ్‌కు అర్హత పొందాలంటే, చెంచా తప్పనిసరిగా స్పష్టంగా కనిపించే గిన్నె, హ్యాండిల్‌ని కలిగి ఉండాలి.కాబట్టి అంత తేలిక కాదు.ఇవి చేసే క్రమంలో ఆయా కళారులు తమ చూపుని కూడా కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.ఇక గతంలో కూడా అనేక రికార్డులు ఇలాంటి చెక్క స్పూనుల పైన వున్నాయి.జైపూర్‌కు చెందిన క్లిప్ కళాకారుడు( Clip artist ) ఒక చిన్న చెక్క చెంచా సృష్టించి గతంలో రికార్డ్స్ బద్దలు కొట్టాడు.
అప్పట్లో దానిని బియ్యం గింజ కంటే కూడా చిన్నదైన ప్రపంచంలోనే అతి చిన్న చెంచాగా అభివర్ణించారు.
ఇకపోతే, ప్రపంచ వ్యాప్తంగా చాలామంది కళాకారులు గిన్నిస్ రికార్డ్స్ ధ్యేయంగా వివిధం రంగాల్లో చాలా ఆసక్తికరంగా పోటీలలో పాల్గొంటున్నారు.ముఖ్యంగా ఇలాంటి పోటీలు అనేవి లలితకళలలో ఒకటైనటువంటి ‘శిల్పం’ తెలిసిన కళాకారులు ట్రై చేస్తూ వుంటారు.తాజాగా రికార్డ్ సృష్టించిన వ్యక్తి కూడా బేసిగ్గా ఒక శిల్పి.
అతను పాలరాతితో అనేక రకాల హిందూ విగ్రహాలు చెక్కుతాడు.అయినప్పటికీ, సూక్ష్మ క్రాఫ్ట్ మ్యూజియంలో రికార్డ్ సృష్టించడం అతని లక్ష్యం.
దాంతోనే ఈ రికార్డ్ సాధ్యపడిందని అతగాడు ఈ సందర్భంగా చెప్పుకొస్తున్నారు.