పంజాబ్ కింగ్స్ ఓటమికి ముంబై గెలుపుకి ఇదెక్కోటే కారణం...

ఐపీఎల్ 17 వ సీజన్( IPL 17th season ) లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్( Mumbai Indians vs Punjab Kings ) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై టీమ్ అనూషమైన విజయాన్ని సాధించింది.ఇక మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లకి 192 పరుగులు చేశారు.

 This Is The Reason Why Punjab Kings Lost And Mumbai Won , Mumbai Won, Punjab Ki-TeluguStop.com

ఇక ముంబై ఇండియన్స్ టీమ్ లో సూర్య కుమార్ యాదవ్ 78 పరుగులు చేసి టీం భారీ స్కోర్ చేయడం లో కీలకపాత్ర వహించాడనే చెప్పాలి.

ఇక 193 పరుగుల పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కి మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది.

తక్కువ పరుగులకే వచ్చిన ప్లేయరు వచ్చినట్లుగా పెవిలియన్ బాట పట్టాడు.ఇక ఇదే క్రమంలో టీమ్ కేవలం 49 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో పడింది.

ఇక అదే సమయంలో శశాంక్ సింగ్( Shashank Singh ) టీం స్కోర్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు.ఇక అందులో భాగంగానే ఆయన 41 పరుగులు సాధించాడు.

ఇక చివర్లో అశుతోష్ శర్మ( Ashutosh Sharma ) భారీ ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా టీం కి విజయాన్ని అందించాలనే ఒక దృఢ సంకల్పం ముందుకు సాగాడు.

అయినప్పటికీ ఆయనకు మద్దతుగా నిలిచి మరొక ప్లేయర్ కరవడం వల్లే ఆయన ఈ మ్యాచ్ లో టీమ్ కి విజయాన్ని అయితే సాధించి పెట్టలేకపోయాడు.కేవలం 28 బంతుల్లో 7 సిక్స్ లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేశాడు.ఇక ఈయనతో పాటు గా మరొక ప్లేయర్ కనక ఈయనకు సపోర్ట్ ఇచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ విజయం సాధించేది.

ఇక 183 పరుగులకు పంజాబ్ కింగ్స్ టీం అలౌట్ అయిపోవడం అనేది చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి.ఇంకొక ఐదు బంతులు మిగిలి ఉన్నాయి.ఐదు బంతుల్లో 10 పరుగులు కొట్టాల్సిన సమయంలో ఒక్క మంచి ప్లేయర్ కనక ఉంది ఉంటే మ్యాచ్ ఈజీగా పంజాబ్ గెలిచేది.ఇక ముంబై ఈ గెలుపుతో మూడోవ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube