తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఒకప్పుడు కలిసి ఉండేవని చాలా మందికే తెలుసు.విడిపోయిన తర్వాత కూడా నాయకులు ఎవరూ పెద్దగా విమర్శించుకోలేదు.
అలా 2014 నుంచి 2019 వరకు ఏపీని టీడీపీ అధినేత చంద్రబాబు పాలించారు.ఆసమయంలో ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ఎటువంటి విమర్శలు చేయలేదు.
తర్వాత 2019లో అక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.ఇక్కడ మాత్రం టీఆర్ఎస్సే రెండో సారి అధికారం చేపట్టింది.
ఈ సందర్భంలో కూడా మొదటగా జగన్ పార్టీతో గులాబీ నేతలు సఖ్యతగానే ఉన్నారు.కానీ ఈ మధ్యే ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లుగా కనిపిస్తోంది.
ఇందుకు నేతలు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలే సమాధానాలు చెబుతున్నాయి.
తాజాగా తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ నగరాన్ని ఇక్కడి నగరాన్ని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న తీరును కొనియాడారు.ఇక్కడి వరకు బాగానే ఉన్నా కానీ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
పక్క రాష్ట్ర నాయకులకు, అధికార పార్టీ వారికి కోపం తెప్పిస్తున్నాయి.కేటీఆర్ మాట్లాడుతూ… పక్క రాష్ట్రంలో అసలు రోడ్లు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు అని విమర్శించారు.

తెలంగాణలోని హైదరాబాద్ బాగుందని చెప్పుకుంటే పర్వాలేదు కానీ మీ పాలనను బాగుందని చెప్పుకోవడానికి పక్క రాష్ట్రాన్ని అక్కడి ప్రజలను బదనాం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు.ఇక ఏపీ అధికార పార్టీ నాయకులైతే కేటీఆర్ మీద అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.కేటీఆర్ ను పలు రకాలుగా విమర్శిస్తున్నారు.ఇవన్నీ చూస్తుంటే అసలు టీఆర్ఎస్ మనసులో ఏముందో బొత్తిగా అర్థం కావడం లేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.