పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ( Vijay devarakonda ) ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ ఆయనకి చాలా మంచి పేరు తీసుకువచ్చింది… ఈ సినిమాతోనే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.ఆయన తీసిన ఈ సినిమా వల్ల చాలా మంది కి లైఫ్ వచ్చిందనే చెప్పాలి.
డైరెక్టర్, హీరో తో పాటు, హీరోయిన్ అయిన రీతు వర్మ, కామెడియన్ ప్రియదర్శన్ లాంటి చాలా మందికి ఈ సినిమా మంచి గుర్తింపు ఇచ్చింది అనే చెప్పాలి… అయితే ఈ సినిమా తరువాత విజయ్ చేసిన అర్జున్ రెడ్డి( Arjun Reddy ) చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిందనే చెప్పాలి.దాని తరువాత ఆయన చేసిన గీత గోవిందం సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయిందనే చెప్పాలి.

రీసెంట్ గా విజయ్ చేసిన లైగర్ సినిమా ప్లాప్ అవ్వడం తో ఆయన మార్కెట్ చాలా డౌన్ అయిందనే చెప్పాలి.ఇక సినిమా ప్లాప్ అయినా విషయం పక్కన పెడితే విజయ్ చేసిన అనవసరపు బిల్డప్ లా వల్లే ఆయన మీద జనాల్లో నెగిటివ్ టాక్ వచ్చిందని చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేశారు అయితే ఆయన పబ్లిక్ గా స్టేజ్ మీద మా తాత ఎవరో తెలీదు, మా నాన్న ఎవరో తెలీదు అయిన కూడా నా కోసం ఈ ఫంక్షన్ కి వచ్చారు అని ఆయన అభిమానులని ఉద్దేశించి మాట్లాడడం వల్ల మిగితా హీరోల ఫ్యాన్స్ హార్ట్ అయ్యారనే చెప్పాలి.దానివల్ల ఒకానొక సమయం లో విజయ్ మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది.అందుకే విజయ్ కొంచం పొగరు తగ్గించుకుంటే మంచిది అని చాలా మంది ఆయనకి సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి సినిమా( Kushi ) చేస్తున్నారు.ఈ సినిమా మీదే విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది…ఈ సినిమా హిట్ అవ్వడం ఇప్పుడు ఆయనకి చాలా కీలకం గా మారింది.ఎందుకంటే ఆయన కన్న తర్వాత ఇండస్ట్రీ కి వచ్చిన హీరోలు మంచి హిట్స్ కొడుతూ ముందుకు వెళ్తుంటే ఆయన మాత్రం ఇప్పుడు ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు… చూడాలి మరి ఈ సినిమా తో అయిన మంచి హిట్ పడుతుందో లేదో…
.