ఇండియాలోనే అత్యంత ఖరీదైన స్వీట్ ఇది.. ధర తెలిస్తే షాక్ అవుతారు!

పండుగల సీజన్ మొదలైంది.ఈ రోజు నుంచి తెలంగాణ ముఖ్య పండుగ బతుకమ్మ( Bathukamma ) స్టార్ట్ అవ్వగా.

ఈ నెలలోనే హిందూవులకు అత్యంత ప్రధాన పండుగ అయిన దసరా రాబోతుంది.ఆ తర్వాత నెలలో దీపావళి, ఇక డిసెంబర్ లో క్రిస్మస్.

ఇలా వరుస పండుగలు రాబోతున్నాయి.పండుగలు వస్తున్నాయంటే స్వీట్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది.

స్వీట్ షాపులన్నీ ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటాయి.షాపులన్నీ బిజీగా ఉంటాయి.

Advertisement

దీంతో స్వీట్ సేల్స్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి.

అయితే స్వీట్లలో చాలా రకాలు ఉంటాయి.వాటిల్లో వాడే పదార్థాలను బట్టి రేటు ఫిక్స్ చేస్తారు.షుగర్, బెల్లం లాంటివి వాడి చేసే స్వీట్ల ధర తక్కువగా ఉంటుంది.

ఇక డ్రైప్యూట్స్( Dryputs ) లాంటి వాడి చేసే స్వీట్ల ధర బాగా ఎక్కువగా ఉంటుంది.కానీ వేలల్లో ధర ఉండే స్వీట్ గురించి విన్నారా.? ఇండియాలోని లక్నోలో ఓ స్వీట్ షాపు రూ.50 వేల ధర చేసే స్వీట్ అమ్మకాలు మొదలుపెట్టింది.చప్పన్ భోగ్ అనే స్వీట్ షాపు( Chappan Bhog sweet shop ) వీటిని విక్రయిస్తోంది.

ఇండియాలోనే అత్యంత ఖరీదైన స్వీట్ గా ఇది నిలిస్తోంది.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?

ఈ స్వీట్ పేరు ఎక్సోటికా.ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన గింజలు, ఎండిన పండ్లతో ఈ స్వీట్ ను తయారుచేస్తారు.అంతేకాదు ఈ స్వీట్ పొరను 24 క్యారెట్ల బంగారంతో కూడా అలరిస్తారు.

Advertisement

ఒక కస్టమర్ నుంచి వచ్చిన ఆర్డర్ తో ఈ ఖరీదైన స్వీట్ ను తయారుచేస్తున్నారు.ఇరాన్ నుంచి మమ్రా బాదం, ఆఘ్ఘనిస్తాన్ నుంచి పిస్తా పప్పులు, సౌతాఫ్రికా నుంచి మకాడమియా గింజలు, కార్మిర్ నుంచి కుంకుమ పువ్వు, టర్రీ నుంచి హాజెల్ నట్స్, కిన్నౌర్ నుంచి పైన్ గింజలు వంటికి ఈ స్వీట్ కోసం తెప్పిస్తున్నారు.

" autoplay>

తాజా వార్తలు