పతంజలి( Patanjali ) చేసిన తప్పుడు ప్రకటనలపై వారం రోజుల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు( Supreme Court ) తెలిపింది.ఈ మేరకు బాబా రామ్ దేవ్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది.
బాబా రామ్ దేవ్ కు ఇదే చివరి అవకాశమని ధర్మాసనం హెచ్చరించింది.ఈ క్రమంలోనే బాబా రాందేవ్( Baba Ramdev ) తో పాటు పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణపై( Patanjali Company MD Balakrishna ) అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పతంజలి తప్పుడు ప్రకటనల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై బాబా రాందేవ్ న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు.అయితే ఈ క్షమాపణలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
అదేవిధంగా తప్పుడు ప్రకటనలపై స్పందించకపోవడంపై కేంద్రం తీరును సుప్రీం తప్పుపట్టింది.పతంజలి అవాస్తవ ప్రకటనలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పతంజలి సంస్థకు చెందిన యాడ్స్ ను నిలిపివేయాలంటూ ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఆదేశాలను పతంజలి సంస్థ బేఖాతరు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం బాబా రామ్ దేవ్ తోపాటు పతంజలి సంస్థ ఎండీకి నోటీసులు జారీ చేసింది.