వెస్టిండీస్ టూర్ వెళ్లే భారత జట్టు ఇదే.. పుజారా కు దక్కని చోటు..!

భారత జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్( West Indies ) పర్యటనకు వెళ్ళనున్న సంగతి తెలిసిందే.

ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్- భారత్ మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.

ఈ మ్యాచ్లతో పాటు భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీని దృష్టిలో ఉంచుకొని జట్టు లో ఉండే సభ్యుల జాబితాను బీసీసీఐ( BCCI ) ప్రకటించింది.బీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం టెస్ట్, వన్డే జట్లకు రోహిత్ శర్మ( Rohit Sharma ) నాయకత్వం వహించనున్నాడు.

ఇక ఐపీఎల్ లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ లకు భారత జట్టులో చోటు లభించింది.ఇక భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ పూజారాకు మాత్రం జట్టులో చోటు దక్కలేదు.

ఎందుకంటే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో 27 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 14 పరుగులు చేసి అందరిని నిరాశపరిచాడు.ప్రస్తుతం జట్టులో చోటు లభించకపోవడంతో పూజారా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

This Is The Indian Team That Will Go On The West Indies Tour Pujara Will Not Get
Advertisement
This Is The Indian Team That Will Go On The West Indies Tour Pujara Will Not Get

2010లో టెస్ట్ క్రికెట్ ద్వారా పూజారా అంతర్జాతీయ క్రికెట్( International cricket ) లోకి అరంగేట్రం చేశాడు.పూజారా తన కెరీర్లో 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.టెస్టులలో మొత్తం 7195 పరుగులు చేశాడు.

ఇందులో 19 సెంచరీలు, 15 అర్థ సెంచరీలు ఉన్నాయి.వన్డేలలో మాత్రం పేలవ ఆటనే ప్రదర్శించాడు.5 వన్డేలలో కేవలం 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు.భారత జట్టు విషయానికి వస్తే వైస్ కెప్టెన్ గా రహానే వ్యవహరించనున్నాడు.

వన్డేలలో హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (c), శుభమన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (vc), కెఎస్ భరత్ (wk), ఇషాన్ కిషన్ (wk), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

This Is The Indian Team That Will Go On The West Indies Tour Pujara Will Not Get

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్.సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు