సింగర్ సునీత,( Sunitha ) రామ్ వీరపనేని టాలీవుడ్ స్వీట్ కపుల్స్ లో ఒక కపుల్ అనే సంగతి తెలిసిందే.సునీత, రామ్ పెళ్లి తర్వాత అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.
రామ్ తో పెళ్లి తర్వాత సునీత పరిమితంగా మూవీ ఆఫర్లకు ఓకే చెబుతున్నారు.తన డబ్బింగ్ ద్వారా కూడా సునీత అభిమానులకు దగ్గరవుతున్నారు.
అయితే సునీత, రామ్ మధ్య ఏజ్ గ్యాప్ తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం.

రామ్, సునీత మధ్య దాదాపుగా నాలుగేళ్ల గ్యాప్ ఉందని తెలుస్తోంది.రామ్ వీరపనేని( Ram veerapaneni ) 1974లో జన్మించగా సునీత 1978లో జన్మించారు.అటు రామ్, ఇటు సునీత ఆస్తుల విలువ భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.
సునీత పిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.సునీత పిల్లలు కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని ఎన్నో రికార్డులు సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత రెమ్యునరేషన్ ( Remuneration )భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.మొదట వీళ్లిద్దరూ స్నేహితులు కాగా ఆ తర్వాత ప్రేమికులు అయ్యారు.ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఎలాంటి సమస్య లేకుండా సునీత, రామ్ పెళ్లి జరిగింది.బిజినెస్ మేన్ గా రామ్ కు మంచి గుర్తింపు ఉంది.రామ్ వీరపనేని వివాదాలకు సైతం దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.
సునీత, రామ్ జోడీ బాగుంటుందని కొంతమంది నెటిజన్లు చెబుతున్నారు.
రామ్ వీరపనేని పలు సినిమాలలో కూడా నటించారు.అయితే ఈ విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.
సునీతకు తెలుగు సినిమాలలో ఎక్కువగా ఆఫర్లు వస్తున్నా ఆమె మాత్రం ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నారు.సింగర్ సునీతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.







