సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఒకరు.ఈయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మరే హీరో చేయలేదు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఆయన చేసిన సినిమాల్లో వేరియేషన్స్ అలా ఉంటాయి.ఇక దానికి అనుగుణంగానే ఆయన సాధించిన సక్సెస్ లు గాని ఆయన పొందిన అవార్డులను గాని చూస్తే మనకి ఈ విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది.
అలాగే ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ కూడా చిరంజీవిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలో ఎదగాలని ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడమే కాకుండా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచాడు.
ఇక ఇదే క్రమంలో ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి హీరోగా ఎదిగిన నటుడు మోహన్ బాబు.( Mohan Babu ) ఈయన మంచి నటుడే అయినప్పటికీ చిరంజీవి రేంజ్ లో స్టార్ హీరోగా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.అయితే ఇదే క్రమంలో మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో ఉండే విషయాల మీద చాలా నిక్కచ్చిగా మాట్లాడుతూ ఎవరిని పడితే వాళ్లను దూషిస్తూ ఉంటాడు.అందువల్లే మోహన్ బాబు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ సంపాదించడంలో చాలా వరకు ఫెయిల్ అయ్యాడు.
అయితే చిరంజీవి మాత్రం ఏ విషయం మీద స్పందించిన ఎవరికైనా చాలా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు.అందువల్లే తన వ్యక్తిత్వం వల్లే చిరంజీవి టాప్ రేంజ్ లోకి వెళ్ళాడు అని మరి కొంతమంది చెబుతూ ఉంటారు.ఇక ఏది ఏమైనా ఇద్దరి మధ్య సినిమాల సక్సెస్ పరంగానే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా తేడాలు ఉండటం వల్లే మోహన్ బాబు కంటే చిరంజీవి టాప్ రేంజ్ లో ఉన్నాడనే చెప్పాలి.