వింటర్ లో హెల్తీ స్కిన్ కు తోడ్పడే బెస్ట్ బాత్ పౌడర్ ఇది.. డోంట్ మిస్!

ప్రస్తుత వింటర్ సీజన్ లో చర్మ ఆరోగ్యాన్ని( Healthy Skin ) కాపాడుకోవడం ప్రతి ఒక్కరికి కత్తి మీద సాములా మారుతుంది.

సరైన తేమ లేకపోవడం, చల్లగాలి, వేడి వేడి నీటితో స్నానం చేయడం తదితర కారణాల వల్ల చర్మం పొడిబారి( Dry Skin ) నిర్జీవంగా మారిపోతుంది.ఎంత ఖరీదైన సోప్స్ వాడినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.దాంతో చర్మ ఆరోగ్య విషయంలో మదన పడుతూ ఉంటారు.

కానీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.వింటర్ లో( Winter ) హెల్తీ స్కిన్ కు తోడ్పడే బెస్ట్ బాత్ పౌడర్ ఒకటి ఉంది.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు శనగపప్పు,( Bengal Gram ) మూడు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు,( Masoor Dal ) రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు,( Sesame ) ఎనిమిది బాదం గింజలు, పావు టీ స్పూన్ పసుపు, గుప్పెడు ఎండిన గులాబీ రేకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని జల్లించి అందులో వన్ టేబుల్ స్పూన్ బాదం ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ బాత్ పౌడర్ ను( Bath Powder ) చలికాలంలో ఏ విధంగా ఉపయోగించాలి అన్నది కూడా తెలుసుకుందాం.ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న బాత్ పౌడర్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్లు పెరుగు మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఉపయోగించి బాత్ చేస్తే చాలా లాభాలు పొందుతారు.చలికాలంలో ఈ బాత్ పౌడర్ చర్మాన్ని తేమ గా ఉంచుతుంది.చర్మంపై చనిపోయిన కణాలను మరియు మురికిని సులభంగా తొలగిస్తుంది.

చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే ఈ బాత్ పౌడర్ ను ఉపయోగించడం వల్ల చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.

అనేక రకాల చర్మ సమస్యలు దూరం అవుతాయి.

బాలయ్యకు ఎన్టీఆర్ పెట్టిన మూడు కండీషన్లు ఏంటో తెలుసా?

తాజా వార్తలు