పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ చరణ్(Ramcharan) హీరోగా పరిచయం అయిన సినిమా చిరుత(Chirutha) ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిన విషయం మనకు తెలిసిందే…మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచిన రామ్ చరణ్ ఆ తరువాత వరుస సినిమాలు తీస్తూ ప్రస్తుతం దేశం లోనే నెంబర్ 1 హీరోగా పేరు తెచ్చుకున్నారు.ఆయన తీసిన లాస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అద్భుతమైన నటన ని కనబరిచిన ఆయన కి ఇప్పటికే చాలా అవార్డ్స్ వచ్చాయి.
రీసెంట్ గా ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది.
అయితే ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ చేసిన చిరుత సినిమాలో మొదట పూరి రాసుకున్న క్లైమాక్స్ మనం చూసేది కాదట ఆయన ఫస్ట్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్లైమాక్స్(Climax) రాసుకున్నారట కానీ అది అంత గా నచ్చకపోవడంతో చిరంజీవి గారి ఖైదీ సినిమాని తలపించేలా ఫారెస్ట్ లో ఒక సీక్వెన్స్ రాసుకొని దాన్నే తెరకెక్కించారు ఆ సినిమాలో రామ్ చరణ్ ని చూసిన అందరూ ఖైదీ సినిమాలో చిరంజీవి ని చూసినట్టు అనిపించింది అని రామ్ చరణ్ మీద ప్రశంశలు కురిపించారు…మొదటి సినిమాకే చిరంజీవి ని దాటివేసాడు తండ్రికి తగ్గ తనయుడు అంటూ చాలా మంది రామ్ చరణ్ మీద పాజిటివ్ గా స్పందించారు.
ఒక వేళ పూరి ఫస్ట్ రాసుకున్న క్లైమాక్స్ కనక పెట్టీ ఉంటే అది పెద్దగా వర్క్ ఔట్ అయ్యేది కాదేమో అని కూడా చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేశారు…ఇక పూరి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చిరంజీవి తో ఒక సినిమా చేసే ఆలోచన లో ఉన్నారు.అన్ని కుదిరితే ఆ సినిమా ఈ సంవత్సరమే సెట్స్ మీదకి కూడా వెళ్ళే అవకాశం ఉంది…చూడాలి మరి పూరి కి చిరంజీవి ఛాన్స్ ఇస్తాడో, లేదో…
.