స్టార్ హీరో సల్మాన్ కు 17 సంవత్సరాల కూతురు ఉందా..?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయారనే సంగతి తెలిసిందే.

పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం ద్వారా వార్తల్లో నిలిచిన సల్మాన్ ఖాన్ పెళ్లికి మాత్రం దూరంగానే ఉన్నారు.

ఒక్కో సినిమాకు 100 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకునే సల్మాన్ ఖాన్ పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్న చాలా సందర్భాల్లో వినిపిస్తోంది.సల్మాన్ ఖాన్ తన పెళ్లి గురించి ఒక్కోసారి ఒక్కో విధంగా స్పందిస్తారు.

రియల్ లైఫ్ లో సినిమాల్లోలా తన వెంట ఎవరూ పడలేదని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.ఒక సందర్భంలో పెళ్లి చేసుకోవడం చచ్చిపోవడం ఒకటేనని సల్మాన్ ఖాన్ అన్నారు.

పెళ్లిపై తనకు నమ్మకం లేదని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని సల్మాన్ కామెంట్లు చేశారు.పెళ్లి కంటే డేటింగ్ మేలని చెప్పి చాలా సందర్భాల్లో పెళ్లి గురించి నెగిటివ్ గా సల్మాన్ ఖాన్ కామెంట్లు చేయడం గమనార్హం.

Advertisement
This Is How Salman Khan Reacted To The Question That He Has Wife And Daughter In

అయితే గతంలో ఒక నెటిజన్ సల్మాన్ ఖాన్ కు పెళ్లైందని, సల్మాన్ ఖాన్ కు 17 సంవత్సరాల వయస్సు ఉన్న కూతురు ఉందని చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది.అతని భార్య పేరు నూర్ అని కూతురు దుబాయ్ లో ఉందని ఆ నెటిజన్ చెప్పుకొచ్చారు.

తాజాగా సల్మాన్ ఖాన్ తన తమ్ముడు అర్భాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న పింఛ్ అనే షోలో పాల్గొన్నారు.అర్భాజ్ ఖాన్ సల్మాన్ ను 17 సంవత్సరాల కూతురు గురించి ప్రశ్నించారు.

This Is How Salman Khan Reacted To The Question That He Has Wife And Daughter In

ఆ ప్రశ్నకు సల్మాన్ ఖాన్ స్పందిస్తూ ఆ ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరి గురించి చెప్పారో తనకు తెలియదని తాను మాత్రం తొమ్మిది సంవత్సరాలుగా గెలాక్సీ అపార్టుమెంట్ లో ఉంటున్నానని చెప్పుకొచ్చారు.ఆ ట్వీట్ చేసిన వ్యక్తి కామెంట్ల గురించి తాను స్పందించనని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు