పురుషుల్లో హెయిర్ ఫాల్‌ను నివారించే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

హెయిర్ ఫాల్.స్త్రీలనే కాదు పురుషులను సైతం తీవ్రంగా కలవరపెట్టే సమస్య ఇది.

అందులోనూ ప్రస్తుత వర్షాకాలంలో పురుషులను హెయిర్ ఫాల్ సమస్య మరింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.దాంతో ఈ సమస్యకు అడ్డు కట్ట వేయడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.

తోచిన చిట్కాలన్నీ ప్రయత్నిస్తుంటారు.అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో అర్థం కాక ఒత్తిడికి లోనవుతుంటారు.

మీరు ఈ జాబితా లో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని పాటిస్తే చాలా సులభంగా హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టవచ్చు.

Advertisement
This Is An Effective Remedy To Prevent Hair Fall In Men! Home Remedy, Hair Pack,

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక కప్పు సోయా బీన్స్, రెండు గ్లాసుల వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న సోయా బీన్స్, రెండు రెబ్బలు కరివేపాకు, గుప్పెడు వేపాకులు మరియు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మాన్ని ప‌ల్చ‌టి వ‌స్త్రంలో వేసి జ్యూస్ ను స‌ప‌రేట్‌ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్‌ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల మెంతి పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని కలుపుకోవాలి.

This Is An Effective Remedy To Prevent Hair Fall In Men Home Remedy, Hair Pack,

చివరిగా అందులో సరిపడా సోయా బీన్స్ జ్యూస్‌ను కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెడ్ బాత్ చేయాలి.

న్యూస్ రౌండప్ టాప్ 20

వారంలో రెండు సార్లు ఈ ప‌వ‌ర్ ఫుల్ రెమెడీని పాటిస్తే పురుషుల్లో హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా దూరమవుతుంది.అదే స‌మ‌యంలో జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు