మ‌లినాల‌ను పోగొట్టి ముఖాన్ని మృదువుగా మెరిపించే ఎఫెక్టివ్ ప్యాక్ ఇదే!

చ‌ర్మంపై మ‌లినాలు పేరుకుపోయే కొద్ది ముఖంలో కాంతి త‌గ్గిపోతుంటుంది.పైగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు సైతం త‌లెత్తుతుంటాయి.

దాంతో మృదువుగా ఉండాల్సిన ముఖం నిర్జీవంగా త‌యారవుతుంటుంది.ఈ క్ర‌మంలోనే ఏం చేయాలో తెలియ‌క చర్మంపై ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటారు.

ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ ప్యాక్‌ను ట్రై చేస్తే మ‌లినాలు తొల‌గిపోయి ముఖం మృదువుగా, కోమ‌లంగా మెరుస్తుంది.

మ‌రి లేటెందుకు ఈ ప్యాక్ ఏంటో, ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెసర పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిప‌ప్పు పిండి, వ‌న్ టేబుల్ స్సూన్ శెన‌గ‌పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ వేపాకుల పొడి, పావు టేబుల్ స్పూన్ వ‌ట్టివేర్ల పొడి వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

Advertisement
This Is An Effective Pack To Get Rid Of Impurities And Make Your Face Glow! Effe

చివ‌రిగా ఇందులో స‌రిప‌డా ప‌చ్చి పాల‌ను పోసి లూస్ స్ట్ర‌క్చ‌ర్‌లో మిక్స్ చేసుకోవాలి.ఒక‌వేళ పాలు లేకుంటే వాట‌ర్ లేదా రోజ్ వాట‌ర్ ను అయినా యూస్ చేయ‌వ‌చ్చు.

This Is An Effective Pack To Get Rid Of Impurities And Make Your Face Glow Effe

ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ఏదైనా బ్రెష్ సాయంతో ముఖానికి, కావాలి అనుకుంటే మెడ‌కు కూడా అప్లై చేసుకుని.ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.ఆపై వేళ్ల‌తో సున్నితంగా రుద్దుకుంటూ శుభ్రంగా వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

మూడు రోజుల‌కు ఒక‌సారి ఈ ప్యాక్ వేసుకుంటే చ‌ర్మంపై పేరుకుపోయిన మ‌లినాలు, మృత క‌ణాలు తొల‌గిపోయి ముఖం మృదువుగా, కోమ‌లంగా మెరుస్తుంది.మ‌రియు ఏమైనా ముదురు రంగు మ‌చ్చ‌లు ఉంటే.

వాటి నుంచి విముక్తి ల‌భిస్తుంది.కాబ‌ట్టి, ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్‌ను త‌ప్ప‌కుండా ట్రై చేసేందుకు ప్ర‌య‌త్నించండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు