పెళ్లి అంటే భయం వేస్తుంది.. శృతి హాసన్ కు ఉన్నట్టుండి వణుకు స్టార్ట్ అయ్యిందే!

భారత నటుడు కమల్ హాసన్ కూతురు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.తన నటనతో మంచి గుర్తింపు అందుకున్న శృతిహాసన్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Shruthi Haasan Shocking Statement Going Viral In Social Media Shruthi Hassan, To-TeluguStop.com

నటిగానే కాకుండా సింగర్ గా కూడా తనలో ఉన్న మరో యాంగిల్ ను బయట పెట్టింది.తనకున్న క్రేజ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఇక ఈమె 2000 లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.2010లో ‘లక్’ అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యింది.ఇక అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

అలా దాదాపు 20 సినిమాలలో నటించింది.

తెలుగుతో, హిందీ తో పాటు తమిళ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ చేస్తుంది కూడా.బాలీవుడ్ లో కూడా తన పాటను వినిపించింది.

చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది.ఇక వ్యక్తిగత విషయంలో శృతి హాసన్ చాలాసార్లు వార్తల్లోకెక్కింది.

అయినా కూడా తాను అవన్నీ పట్టించుకోకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.ఇక శృతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతా ను హజారికా తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

Telugu Kamal Hasan, Shruthi Hassan, Tollywood-Movie

నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ఇక తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తనకు పెళ్లి అంటే భయం అని తెలిపింది.తాజాగా ఈ ముద్దుగుమ్మకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురవడంతో.పెళ్లి అంటేనే భయం వేస్తుందని.

తన తల్లిదండ్రుల పెళ్లి విడాకులకు దారితీసిందని తను ఈ మాట చెప్పడం లేదు అంటూ.కానీ తనలో పెళ్లి అంటే అదోరకమైన భయం ఏర్పడుతుంది అని.పెళ్లి అంటే ఎంత నమ్మకం ఉన్నప్పటికీ లోలోపల భయం మాత్రం ఉంది అని.తన బాయ్ ఫ్రెండ్ పరిచయమయ్యాక అనేక మార్పులు చోటు చేసుకున్నాయని.

అనేక విషయాలలో తమ ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి అని తెలిపింది.మొత్తానికి ఈ అమ్మడుకు పెళ్లి అంటే బాగానే వణుకు పుట్టింది అని తెలుస్తుంది./br>

Telugu Kamal Hasan, Shruthi Hassan, Tollywood-Movie

ఇక శృతి హాసన్ గతంలో తన వ్యక్తిగత విషయం పట్ల సినిమాలకు దూరం కాగా మళ్లీ రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.ఇక ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో నటిస్తుంది.ఇక తెలుగులో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతుండగా.ఇందులో స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్నాడు.అంతే కాకుండా మరో సినిమాలో కూడా అవకాశం అందుకున్నట్లు తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube