రక్తహీనత ఎంత తీవ్రంగా ఉన్నా సరే నెల రోజుల్లో తరిమికొట్టండిలా!

రక్తహీనత.పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మందిని కలవరపెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

రక్తహీనత(anemia) అనుకున్నంత చిన్న సమస్య ఏమీ కాదు.రక్తహీనతను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పుగా మారుతుంటుంది.

అందుకే రక్తహీనతను వదిలించుకోవడం కోసం చాలా మంది మందులు వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే అస్సలు చింతించకండి.రక్తహీనత ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ తో నెల రోజుల్లోనే తరిమికొట్ట‌వ‌చ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

This Is A Super Powerful Drink That Prevents Anemia Anemia, Powerful Drink, Lat
Advertisement
This Is A Super Powerful Drink That Prevents Anemia! Anemia, Powerful Drink, Lat

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ రాగి పిండి, చిటికెడు పింక్‌ సాల్ట్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని కనీసం పది నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.ఈ రాగి మిశ్రమం చల్లారే లోపు మిక్సీ జార్ తీసుకొని అందులో పది నైట్ అంతా నానబెట్టుకుని పొట్టు తొలగించిన బాదం, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు(Dates), ఒక గ్లాసు కొబ్బరిపాలు(Coconut milk) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

This Is A Super Powerful Drink That Prevents Anemia Anemia, Powerful Drink, Lat

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ ను గోరువెచ్చగా ఉన్న రాగి మిశ్రమంలో కలపాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తాటి బెల్లం పొడి వేసి బాగా మిక్స్ చేస్తే హెల్తీ అండ్ టేస్టీ రాగి కోకోనట్ డ్రింక్‌(Ragi Coconut Drink) సిద్ధమవుతుంది.

రోజుకు ఒక గ్లాస్ చొప్పున ఈ డ్రింక ను ప్ర‌తి రోజు తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ లభిస్తుంది.హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.దీంతో రక్తహీనత సమస్య పరార్ అవుతుంది.

కాబట్టి ఎవరైతే రక్తహీనత సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ రాగి కోకోనట్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు