జ్ఞాపకశక్తిని పెంచే లడ్డు ఇది.. రోజు తీసుకుంటే మ‌రెన్నో బెనిఫిట్స్‌!

నేటి ఆధునిక కాలంలో బిజీ లైఫ్ స్టైల్, పని ఒత్తిడి, ఆందోళన, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత తదితర కారణాల వల్ల చాలా మందిలో జ్ఞాపక శక్తి అనేది లోపిస్తోంది.

జ్ఞాపక శక్తి తగ్గితే చిన్న చిన్న విషయాలను కూడా మర‌చిపోతుంటారు.

ఆ చిన్న విషయాలు రేపు పెద్దగా మారుతుంటాయి.అంత వరకు వెళ్లకుండా ఉండాలంటే జ్ఞాపక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే లడ్డు అద్భుతంగా సహాయపడుతుంది.ఈ లడ్డూను తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి రెట్టింపు అవ్వడమే కాదు మరెన్నో ఆరోగ్య లాభాలను సైతం తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో మూడు దాల్చిన చెక్కలు, పది యాలకులు, చిటికెడు కుంకుమపువ్వు, వన్ టేబుల్ స్పూన్ సోంపు, పది మిరియాలు వేసుకుని లైట్ గా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

Advertisement
This Is A Memory Boosting Laddu , Memory Boosting Laddu, Laddu, Healthy Laddu, L

ఆ తర్వాత అదే పాన్ లో వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, వన్ టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు, రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు వేసి వేయించుకోవాలి.అలాగే అర కప్పు వాల్ నట్స్, అర కప్పు బాదం పప్పు, అర కప్పు జీడిపప్పు, అర కప్పు పిస్తా పప్పు కూడా వేయించి పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పదార్థాలన్నీ వేసుకోవాలి.అలాగే ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

This Is A Memory Boosting Laddu , Memory Boosting Laddu, Laddu, Healthy Laddu, L

ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.ఈ‌ లడ్డూలను ఒక డబ్బాలో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజుకొకటి చొప్పున ప్రతిరోజు ఈ లడ్డూలను తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

జ్ఞాపక శక్తి తో పాటు ఆలోచన శక్తి రెట్టింపు అవుతుంది.అంతేకాదు ఈ లడ్డూను తీసుకోవడం వల్ల ఎముకల బలహీనత దూరం అవుతుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

కండరాలు బలంగా మారుతాయి.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Advertisement

మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

తాజా వార్తలు