ప్రతీ ఒక్కరు ఏదేని ఒక పని చేసేది జానెడు పొట్ట కోసమే అన్న సంగతి అందరికీ విదితమే.తన పొట్ట నింపుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల కోసం మనిషి కష్టపడుతుంటాడు.
ఈ క్రమంలోనే కోటి విద్యలు కూడు కోసమే, జానెడు పొట్ట కోసమే మానవుడి ఆరాటం వంటి వాక్యాలు లేదా ఇంకా కొన్ని ఇటువంటి మాదరి సామెతలు పెద్దలు చెప్తుంటారు.మనుషుల మాదిరిగానే జంతువులు కూడా పొట్ట కూటి కోసం కష్టపడే పరిస్థితులు నేడు ఉన్నాయి.
అయితే, జంతువులు తమకు ఏదైనా ఆపద లేదా కష్టం ఎదురైనప్పుడు చాలా తెలివిగా వ్యవహరిస్తుండటం మనం చూడొచ్చు.వాటిని అబ్జర్వ్ చేస్తే చాలు.
మనం వాటి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.
విశ్వాసానికి ప్రతీక అయిన శునకం అంటే జనాలు అందరికీ ఇష్టం ఉంటుంది.
తమ ఓనర్ పట్ల డాగ్స్ ఎంత నమ్మకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు.ఇకపోతే అటువంటి నమ్మకాన్ని ప్రదర్శించే డాగ్స్ వీడియోలు బోలెడు సోషల్ మీడియాలో గతంలో వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరలవుతోంది.సదరు వీడియోలో కుక్క చాలా తెలివిగా వ్యవరహిస్తోంది.
జనాలను తన వైపునకు ఆకర్షించడానికి ప్రత్యేక శైలిని అవలంభిస్తోంది డాగ్.కుక్క తన నాలుగు కాళ్లతో నేలపై నడుస్తూ.
బాధపడుతున్నట్లు యాక్ట్ చేస్తోంది.
ఏదో ప్రమాదంలో తన రెండు కాళ్లు పోతే ఎటువంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుందో ఆ మాదిరిగా ఆస్కార్ రేంజ్‌లో శునకం నటిస్తోంది.అయితే, వీడియోను క్షుణ్ణంగా చూస్తే కొద్ది సేపటి తర్వాత అది ఉట్టి యాక్టింగే అన్న సంగతి మనకు అర్థమవుతుంది.ఈ కుక్క నటనకు సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లు వెరీ గుడ్ యాక్టింగ్, ఆస్కార్ లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే డాగ్ యాక్టింగ్ వెండితెరపైన యాక్ట్ చేసే నటీనటులను మించిపోయిందని పోస్టులు పెడుతున్నారు.