లింక్డ్ఇన్( LinkedIn ) గురించి మనకు తెలిసే ఉంటుంది.ఉద్యోగాలు గురించి తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు.
వివిధ కంపెనీలతో పాటు హెచ్‌ఆర్‌లు ఈ ఫ్లాట్‌ఫామ్‌లో ఉద్యోగ సమాచారం పోస్ట్ చేశారు.దీంతో దీని ద్వారా సులువుగా ఉద్యోగాలు ఏ కంపెనీలో ఉన్నాయో తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చన్నమాట.
ఇక హెచ్‌ఆర్‌లతో నేరుగా కాంట్రాక్ట్ అవ్వడం, వారి నుంచి కంపెనీకి సంబంధించిన సమాచారం ఈజీగా ఛాట్ ద్వారా తెలుసుకోవచ్చు.దీంతో చాలామంది లింక్డ్‌ఇన్‌ను వాడతారు.
అయితే అమెరికాలో చిన్న వయస్సులోనే ఒక స్టార్టప్ కంపెనీకి సీఈవో అయిన 15 ఏళ్ల ఎరిక్ ఝూను లింక్డ్ఇన్‌లో నిషేధించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.అవియాటో అనేక కంపెనీకి ఇతడు సీఈవోగా పనిచేస్తున్నాడు.అయితే లింక్డ్‌ఇన్‌లో తనను నిషేధించడంపై అతడు ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టాడు.లింక్డ్ఇన్‌లో తనను ఎందుకు అసలు బ్యాన్ చేశారో అర్ధం కావడం లేదని, తన అకౌంట్ ఎందుకు కనిపించడం లేదో అర్ధం కావడం లేదంటూ పోస్ట్ పెట్టాడు.దీంతో అతడి పోస్టును 6 లక్షల మంది చూడగా.4 వేల మంది లైక్స్ కొట్టారు.దీంతో అతడి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే లింక్డ్ఇన్ అకౌంట్ తెరవాలంటే కనీసం 16 ఏళ్ల వయస్సు ఉండాలి.కానీ ఇతడికి 15 ఏళ్లు కావడంతో అతడి అకౌంట్‌ను లింక్డ్ఇన్ తొలగించినట్లు తెలుస్తోంది.హైస్కూల్‌లో చదువుతున్న ఎరిక్ ఎవియాట్( Eric zhu ) అనే స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేశాడు.
ఈ కంపెనీలో బాచ్‌మానిటీ క్యాపిటల్‌లో పెట్టుబడిదారుడిగా కూడా చేరాడు.ఈ కంపెనీలో ఇటీవల కొత్తగా చేరిన ఉద్యోగి హే ఎరిక్ నేను మీ కంపెనీలో నా ఉద్యోగంపై సంతోషిస్తున్నా అంటూ పోస్ట్ పెట్టాడు.
అయితే లింక్డ్ఇన్‌లో మిమ్మల్ని ట్యాగ్ చేయలేకపోయానంటూ పోస్ట్ పెట్టాడు.ఈ పోస్ట్ స్క్రీన్‌షాట్ తీసి ఎరిక్ తన ట్విట్టర్‌లో( Twitter ) షేర్ చేశాడు.