శబరిమలకు తీరువాభరణం యాత్ర ఎలా జరిగిందంటే..

భక్త కోటి శరణు ఘోష మధ్య తిరువాభరణా యాత్ర గురువారం మొదలై పండలం లోని దేవాలయం నుంచి ఈ పవిత్ర ఆభరణాలను శాస్త్రోక్తంగా ఊరేగింపుగా తీసుకొచ్చారు.

ఈ ఆభరణాలను పవిత్ర మకరవిళాక్కు సందర్భంగా జనవరి 14న అయ్యప్ప స్వామికి అలంకరించారు.

ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రతినిధులు పండలం నుంచి వచ్చిన ఆభరణాలను స్వీకరించి భక్తుల దర్శనార్థం కొంత సేపు శాస్త ఆలయంలో ఉంచారు.ఈ ఆభరణాలను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు కూడా చేశారు.

సాంప్రదాయంగా చేసే పూజాదికాల తర్వాత భక్తుల శరణు ఘోష మధ్య ఈ పవిత్ర ఆభరణాలను చెక్క బాక్సులో పెట్టి శబరిమల తీసుకొని వెళ్లారు.గత ఆరు దశాబ్దాలుగా నియమ నిష్టలతో ఈ క్రతువును నిర్వహిస్తున్న కులథినాల్ గంగాధరన్ పిళ్లై ఆధ్వర్యంలో ఈ ఆభరణాలను తల పై పెట్టుకుని మూడు రోజుల పాటు నడిచి జనవరి 14 సాయంత్రానికి శబరిమల చేరుకున్నారు.

Thiruvabharanam Yatra Sets Off Shabarimala Details, Thiruvabharanam Yatra , Shab

ఈ ఊరేగింపుకు పండలం రాజా కుటుంబ ప్రతినిధి కత్తి చేత పట్టుకొని రక్షణ కల్పించాల్సి ఉండగా అది సాధ్యం కాలేదు.ఎందుకంటే ఈ సంవత్సరం పండలం రాజా కుటుంబంలో మరణం సంభవించడం వల్ల రాజా కుటుంబ ప్రతినిధి ఈ ఊరేగింపు లో పాల్గొనడం జరగలేదు.ఈ పవిత్ర ఊరేగింపున కు కేరళ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.

Thiruvabharanam Yatra Sets Off Shabarimala Details, Thiruvabharanam Yatra , Shab
Advertisement
Thiruvabharanam Yatra Sets Off Shabarimala Details, Thiruvabharanam Yatra , Shab

పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంలో సఫలమయ్యారు.ఆ పవిత్ర ఆభరణాలను జనవరి 14న దీపారాధనకు ముందు స్వామివారికి తంత్రి కందరపు రాజీవరరు అలంకరించారు.అయ్యప్ప స్వామికి ఈ పవిత్ర ఆభరణాలను అలంకరించడం లో తంత్రి కందరపు రాజీవరరుకు మెల్సాంతి సహకరించారు.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు